Train Tatkal Ticket : ట్రెయిన్ తాత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే నూటికి నూరు శాతం అది సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే.. తాత్కాల్ టికెట్ అంత ఈజీగా దొరకదు. ఒక్క నిమిషంలో ఉన్న టికెట్లు అన్నీ అయిపోతాయి. మన వివరాలు అన్నీ ఇచ్చి పేమెంట్ చేసేలోపు టికెట్లు అన్నీ అయిపోయి మనకు వెయిటింగ్ లిస్టు చూపిస్తుంది. అరె.. ఇప్పుడే కదా టికెట్స్ ఉన్నట్టు చూపించింది. ఇంతలోనే అయిపోయాయా అంటే అవును అయిపోతాయి. అస్సలు ఏమాత్రం ఆలస్యం చేసినా.. క్షణాల్లో టికెట్లు అన్నీ సేల్ అయిపోతాయి. అందుకే.. ట్రెయిన్ తాత్కాల్ టికెట్ అంటేనే చాలామంది తీయరు. అది దొరకదు అని ఫిక్స్ అయిపోతారు.
కానీ.. మీరు ఈ చిన్న ట్రిక్ ఫాలో చేస్తే మీకు ఖచ్చితంగా తాత్కాల్ టికెట్ కూడా దొరుకుతుంది. ఎప్పుడైనా తాత్కాల్ టికెట్ తీసుకోవాలంటే అస్సలు భయపడకండి. టికెట్ బుక్ కాదేమో అని టెన్షన్ పడకండి. ఎందుకంటే.. టికెట్ ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ.. దాని కంటే ముందు మీరు ఇలా చేయాలి. చాలామంది ఈరోజుల్లో ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కాబట్టి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఐఆర్సీటీసీకి చెందిన ఐఆర్సీటీసీ తాత్కాల్ ఆటోమెషన్ టూల్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్ లో ఎక్స్‌టెన్షన్స్‌ను సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఈ టూల్ ను సెర్చ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవాలి.
Train Tatkal Ticket : ఈ టూల్ కి తాత్కాల్ టికెట్ కి ఏంటి సంబంధం?
ఈ టూల్ ను సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని బ్రౌజర్ కి యాడ్ చేశాక ఆ టూల్ ఓపెన్ చేసి మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు ఏ వివరాలు అయితే ఇవ్వాలని అనుకుంటారో ఆ వివరాలను ముందే ఈ టూల్ లో ఫిల్ చేసి పెట్టుకోండి. ఉదాహరణకు ప్యాసెంజర్ పేరు, ఇతర వివరాలు అన్నీ ముందే ఇచ్చేస్తే అది సేవ్ చేసి పెట్టుకుంటుంది.
ఎప్పుడైతే మీరు తాత్కాల్ టికెట్ బుక్ చేసేందుకు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తారో మీరు జస్ట్ బుక్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయడమే. ఎందుకంటే.. మీరు ఇప్పటికే ప్యాసెంజర్ వివరాలు సేవ్ చేసి పెట్టారు కాబట్టి.. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ చేసే ముందు.. ఎక్స్‌టెన్షన్ ఓపెన్ చేసి లోడ్ డేటా అంటే చాలు. మొత్తం ప్యాసెంజర్ వివరాలు అందులో యాడ్ అవుతాయి. కాబట్టి మీరు మరోసారి ప్యాసెంజర్ వివరాలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే పేమెంట్ చేస్తే చాలు.. నిమిషంలోపే టికెట్స్ బుక్ అవుతాయి.