bsnl prepaid best plans details
bsnl prepaid best plans details

BSNL Best Plans : ఒకప్పుడు మొబైల్స్ లో కాల్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవాళ్లం. అవసరం ఉన్నంత మేరకే మాట్లాడి ఫోన్ కట్ చేసేవాళ్లం. డేటా కూడా అంతే. చాలా పొదుపుగా డేటాను ఉపయోగించుకునేవాళ్లం. నెల మొత్తానికి 1 జీబీ లేదంటే 2 జీబీల డేటాను తీసుకునే వాళ్లం. దాన్నే చాలా పొదుపుగా వాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు జియో పుణ్యమాని నెలకు ఒకసారి కొనుక్కునే డేటా రోజుకు పరిమితం అయిపోయింది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్. ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు. ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. టెలికం రంగంలో మూడునాలుగేళ్లలోనే విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

bsnl prepaid best plans details

కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్లాన్ కు కూడా డిమాండ్ బాగా పెరిగింది. అయితే జియో ధాటికి తట్టుకొని నిలబడటం కోసం ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీలు కూడా తమ టారిఫ్ లను తగ్గించేశాయి. చివరకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తప్పని పరిస్థితుల్లో జియో, ఇతర ప్రైవేటు టెలికాం నెట్ వర్క్స్ కు పోటీగా పలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.

గత సంవత్సరం కరోనా రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ చాలా మంది తీసుకోవడంతో… బీఎస్ఎన్ఎల్ కూడా 599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ అన్నింట్లోనూ బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ తో ప్రతి రోజు ఉచితంగా 5 జీబీల డేటా వస్తుంది. ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వాళ్లకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. వాయిస్ కాలింగ్ అన్ లిమిటెడ్, ఫ్రీ ఎస్ఎంఎస్ ఆఫర్ కూడా లభిస్తుంది.

BSNL Best Plans : మరో బెస్ట్ ప్లాన్… 199

బీఎస్ఎన్ఎల్ మరో బెస్ట్ ప్లాన్ 199 ని వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం… ప్రతి రోజు 2 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే… ఇదే ఆఫర్ వేరే నెట్ వర్క్స్ లో అయితే 249 రూపాయలుగా ఉంది. సేమ్ రోజూ 2 జీబీ డేటా, 28 రోజుల ప్లాన్ వాలిడిటీ ఉంటుంది.

అలాగే… బీఎస్ఎన్ఎల్ తాజాగా కొన్ని ప్రమోషనల్ ఆఫర్స్ ను తీసుకొచ్చింది. 48 రూపాయలతో రీచార్జ్ చేస్తే 5 జీబీ డేటా వస్తుంది. 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే 96 రూపాయలతో రీచార్జ్ చేస్తే 11 జీబీ డేటా వస్తుంది. 30 రోజుల వాలిడిటీ.

బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్ కు కూడా ప్రారంభించింది. 2399 రూపాయలతో రీచార్జ్ చేస్తే సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రోజూ 3 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. అయితే… ఈ ప్లాన్ వాలిడిటీని ప్రస్తుతం సంవత్సరం నుంచి 437 రోజులకు బీఎస్ఎన్ఎల్ పొడిగించింది.

పోస్ట్ పెయిడ్ లో బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ఆఫర్స్ ను అందిస్తోంది. 199, 798, 999 రూపాయల బెస్ట్ ప్లాన్స్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

ఇతర బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్

Price Benefits Validity
147 రూపాయలు 10GB డేటా, అపరిమిత కాల్స్ 30 రోజులు
రూ .187 రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్ 28 రోజులు
రూ .247 రోజుకు 3GB డేటా, అపరిమిత కాల్స్ 30 రోజులు
319 రూపాయలు అపరిమిత వాయిస్ కాల్ 75 రోజులు
398 రూపాయలు FUP పరిమితి, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లేని అపరిమిత డేటా ప్రయోజనం 30 రోజులు
429 రూపాయలు రోజుకు 1 జిబి డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ 81 రోజులు
499 రూపాయలు రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్ 90 రోజులు
998 రూపాయలు రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్ 240 రోజులు
1,999 రూపాయలు రోజుకు 3GB డేటా, అపరిమిత కాల్స్ 365 రోజులు

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 10, 2021 at 8:37 ఉద.