chatgpt helps company to recover rs 90 lakh from client

ChatGPT : ఇది టెక్నాలజీ యుగం అనుకుంటున్నారా? కాదు.. అంతకుమించి. అవును.. టెక్నాలజీ అంటే కేవలం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు అనుకునేరు. అంతకుమించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాజ్యమేలుతోంది. అవును.. చాట్ బాట్స్, చాట్ జీపీటీలదే రాజ్యం. చాట్ జీపీటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. చాట్ జీపీటీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పటికే చాలామందికి తెలుసు.

ఎలాంటి విషయాలను అయినా చాట్ జీపీటీలో అడిగి తెలుసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి సమాచారాన్ని అయినా చాట్ జీపీటీ అందిస్తుంది. అయితే.. ఇప్పుడు ఆ చాట్ జీపీటీ ఏకంగా ఓ కంపెనీకి చాలా లాభం చేకూర్చింది. అవును.. ఏకంగా రూ.90 లక్షలను రికవరీ చేసింది. ఆ డబ్బు మీద ఆశలు వదిలేసుకున్న కంపెనీకి ఆ డబ్బులు వచ్చేలా చేసి మరోసారి వార్తల్లో నిలిచింది చాట్ జీపీటీ.

ChatGPT : ఒకే ఒక్క మెయిల్ తో అద్భుతం సృష్టించిన చాట్ జీపీటీ

అసలు ఏం జరిగింది అంటే.. ఓ కంపెనీ తమ క్లయింట్ కు పలు డిజైన్ వర్క్స్ చేసింది. ఆ డిజైన్ వర్క్స్ పూర్తయ్యాక పంపించాల్సిన పేమెంట్ మాత్రం రాలేదు. చాలా సార్లు కంపెనీ ఎండీ సదరు క్లయింట్ కు మెయిల్ చేశారు. కానీ.. అటు నుంచి రెస్పాన్స్ లేదు. దీంతో ఏం చేయాలో గ్రెగ్ కు అర్థం కాలేదు. ఇక ఒక లాయర్ ను పెట్టుకొని ఆ డబ్బు వసూలు చేయాలి అనుకున్నాడు. కానీ.. ఇంతలో ఎవరో చాట్ జీపీటీ ద్వారా ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో అని చెప్పారు.

chatgpt helps company to recover rs 90 lakh from client

దీంతో చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. తనకు ఒక మంచి మెయిల్ రాసివ్వాలని.. మాకు చెల్లించాల్సిన డబ్బును ఆ క్లయింట్ చెల్లించేలా ఒక మెయిల్ రాసి ఇవ్వాలని చాట్ జీపీటీకి రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో చాట్ జీపీటీ చక్కగా ఒక మెయిల్ పంపించింది. ఆ మెయిల్ ను క్లయింట్ కు చేశాడు. మెయిల్ చేసిన 2 నిమిషాల్లో క్లయింట్ నుంచి స్పందన వచ్చింది. మీకు చెల్లించాల్సిన డబ్బును వెంటనే చెల్లిస్తామంటూ వెంటనే బదులివ్వడంతో చాట్ జీపీటీకి ఆ కంపెనీ ఎండీ కోటి సార్లు థాంక్యూ చెప్పాడు. ఈ విషయాన్ని గ్రెగ్.. సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. దీంతో ఆ ట్వీట్ కాస్త వైరల్ అవుతోంది. చాలామంది చాట్ జీపీటీని తెగ పొగిడేస్తున్నారు.