Coca Cola Phone : కొకకోలా అనగానే మనకు గుర్తొచ్చేది కూల్ డ్రింక్. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి మనకు కొకకోలా బ్రాండ్ చాలా ఫేమస్. పేరుకు చాలా కూల్ డ్రింక్స్ ఉన్నా కొకకోలా కంపెనీ నుంచి వచ్చే కూల్ డ్రింక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మార్కెట్ లో వాటికే చాలా డిమాండ్ ఉంది. అయితే.. సాఫ్ట్ డ్రింక్స్ నుంచి ఏకంగా స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే రేంజ్ కు ఎదిగింది కొకకోలా. నిజానికి ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో తన మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ను ఏర్పాటు చేసింది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లను తయారు చేసేందుకు రెడీ అవుతోందట. దానికి కొకకోలా అనే పేరే పెట్టి మార్కెట్ లోకి విడుదల చేయనుందని సమాచారం. వచ్చే మార్చిలోపు కొకకోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం కొకకోలా ఒక స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థతో ఒప్పందం కుదర్చుకుందట. ఆ కంపెనీ ఏంటనేది తెలియనప్పటికీ.. స్మార్ట్ ఫోన్ ను మాత్రం అత్యాధునికమైన ఫీచర్లతో తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

Coca Cola Phone : చూడటానికి అచ్చం రియల్ మీ ఫోన్లలా ఉన్న డిజైన్
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొకకోలా స్మార్ట్ ఫోన్ డిజైన్ చూస్తే అచ్చం రియల్ మీ ఫోన్లలా ఉన్నా.. ఐఫోన్ కు దీటుగా ఈ ఫోన్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొకకోలా భారత్ లో కూడా మంచి నమ్మకమైన సంస్థగా పేరు పొందింది. అదే పేరును ఉపయోగించుకొని స్మార్ట్ ఫోన్ల రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మార్కెట్ లో మరింత పేరు తెచ్చుకునేందుకు కొకకోలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి కొకకోలా స్మార్ట్ ఫోన్లు ఏ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటాయో.