Youtube Policies : మీకు యూట్యూబ్ చానెల్ ఉందా? యూట్యూబ్ చానెల్ లో వీడియోలు గట్రా పోస్ట్ చేస్తున్నారా? ఈ మధ్య మీకు యూట్యూబ్ నుంచి ఏదైనా మెయిల్ వచ్చిందా? యూట్యూబ్ పాలసీలు చేంజ్ అవుతున్నాయి అన్నట్టుగా ఏదైనా మెయిల్ వచ్చిందా? తొందరపడి ఆ మెయిల్ ను క్లిక్ చేశారా? ఆగండి.. అది నిజంగా యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్ కాదు. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిన మెయిల్ అయింది. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పంథాను వెతుకుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్ మీద పడ్డారు. యూట్యూబ్ ను, యూట్యూబ్ యూజర్లను టార్గెట్ చేశారు. వాళ్ల ట్రాప్ లో పడితే ఇక అంతే.
యూట్యూబ్ లో రూల్స్ మారాయి. కొత్త పాలసీలు వచ్చాయి.. అంటూ గత కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ నుంచి వచ్చినట్టుగా, యూట్యూబ్ మెయిల్ పంపినట్టుగా మెయిల్ ను పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అటువంటి మెయిల్ కనుక మీకు వస్తే వెంటనే ఆ మెయిల్ ను డిలీట్ చేయండి.
Youtube Policies : మానెటైజేషన్ రూల్స్ మారుతున్నాయి అంటూ మెయిల్స్
యూట్యూబ్ లో చాలామంది యూజర్లు డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటారు. అలా చాలామంది యూజర్లు ఉన్నారు. వాళ్లను భయపెట్టడానికి యూట్యూబ్ లో మానెటైజేషన్ రూల్స్ మారుతున్నాయి అంటూ యూట్యూబ్ నుంచి పంపిస్తున్నట్టుగా స్కామర్స్ మెయిల్స్ పంపిస్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ ఒక లింక్ ను కూడా పంపిస్తున్నారు.
మెయిల్ వచ్చిన వారం రోజుల్లో డాక్యుమెంట్ ను రివ్యూ చేసి రిప్లయి పంపించకపోతే యూట్యూబ్ చానెల్ బ్లాక్ అవుతుందని మెయిల్ పంపించి యూజర్లను భయపెడుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే స్కామర్స్ కి చిక్కినట్టే. దీనిపై యూట్యూబ్ కూడా వివరణ ఇచ్చింది. యూజర్లకు యూట్యూబ్ ఎలాంటి లింక్స్ పంపించలేదని, మానెటైజేషన్ కు సంబంధించి ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. అటువంటి మెయిల్స్ కు దూరంగా ఉండాలని యూట్యూబ్ తమ యూజర్లకు తెలిపింది.