extra features in battlegrounds mobile india
extra features in battlegrounds mobile india

PUBG : పబ్ జీ గేమ్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇండియాకు చెందిన టీనేజ్, యుక్త వయసు వాళ్లకు అసలు ఈ గేమ్ గురించి పరిచయమే అక్కర్లేదు. అప్పట్లో.. రోజులకు రోజులు పబ్ జీ గేమ్ ఆడుతూ గడిపేవాళ్లు నేటి యూత్. పబ్ జీ గేమ్ ఎప్పుడైతే ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయిందో.. గేమ్ చేసిన హడావుడి మామూల్ది కాదు. పబ్ జీ ఇండియాలో ఒక రికార్డును క్రియేట్ చేసింది. చైనాకు చెందిన ఈ గేమింగ్ యాప్ విడుదల అవ్వడమే ఆలస్యం.. ఇండియాలో సూపర్ సక్సెస్ అయింది. కొన్ని కోట్ల డౌన్ లోడ్స్.. ఫుల్ పాపులారిటీ. ఇక.. అందరూ పబ్ జీకి దాసోహం అన్నారు. అందరూ దానికి అడిక్ట్ అయ్యారు. యూత్ మాత్రమే కాదు.. మధ్య వయసు వాళ్లు కూడా ఈ గేమ్ కు చాలా అలవాటు పడిపోయారు. కానీ.. సడెన్ గా భారత ప్రభుత్వం చైనాకు చెందిన కొన్ని యాప్స్ ను బ్యాన్ చేసింది. అందులో పబ్ జీ కూడా ఉంది. దీంతో పబ్ జీ లవర్స్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. కానీ.. పబ్ జీ లవర్స్ కోసం పబ్ జీ గేమ్ ను తయారు చేసిన కంపెనీ.. కేవలం ఇండియాలో సరికొత్త ఫార్మార్ట్ లో దూసుకొస్తోంది. దాని పేరే Battlegrounds Mobile India.

extra features in battlegrounds mobile india

ఇదివరకు ఉన్న PUBG Mobile అనే పేరును తీసేసి.. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో త్వరలోనే ఇండియాలో లాంచ్ కాబోతోంది ఈ యాప్. ఇప్పటికే ఈ యాప్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ యాప్ ను డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లేకుండా.. ప్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పెట్టారు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి.. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని టైప్ చేసి.. రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఓఎస్ వినియోగదారులకు కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తామని బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ కంపెనీ KRAFTON తెలిపింది.

అయితే.. ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. ఇదివరకు లాంచ్ అయిన పబ్ జీ, ఇప్పుడు త్వరలో లాంచ్ కాబోతున్న Battlegrounds గేమ్ .. రెండూ ఒకటేనా.. లేదంటే బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ లో ఏదైనా తేడా ఉంటుందా? అనే ప్రశ్న ప్రస్తుతం ప్రతి గేమ్ లవర్ లోనూ కలుగుతోంది. అటువంటి వాళ్ల ప్రశ్నకు సమాధానమే ఈ కథనం.

PUBG : పబ్ జీ యాప్ ను తలదన్నేలా బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ ఫీచర్స్

అయితే.. పబ్ జీ యాప్ లో ఉన్న కొన్ని ఇష్యూస్ ను పరిష్కరించడంతో పాటు.. సెక్యూరిటీని పెంచి.. ఎక్స్ ట్రా ఫీచర్స్ ను యాప్ చేశారు బ్యాటిల్ గ్రౌండ్స్ లో. సాధారణంగా.. పబ్ జీలో ఉండే Royale Pass, Skins లాంటి ఫీచర్స్ తో పాటు.. Battlegrounds Mobile India లో multiplayer mode, వివిధ రకాల మ్యాప్స్ అయినటువంటి.. Miramar, Sanhok, Vikendi, Livik లాంటివి ఉంటాయి.

ఇక.. Battlegrounds Mobile India లో.. high prize eSports tournaments కూడా జరుగుతాయి. అలాగే.. సెక్యూరిటీ బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ లో ఎక్కువ. ఎందుకంటే.. ఇదివరకు పబ్ జీ లో సెక్యూరిటీ, ప్రైవసీ సమస్యలు రావడంతోనే యాప్ ను బ్యాన్ చేశారు. కానీ.. ఈసారి బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ కు సంబంధించిన యూజర్ల సమాచారం, ఇతర సమాచారం మొత్తం.. ఇండియాలోని సర్వర్లలోనే నిక్షిప్తం కానున్నాయి. అందుకే.. సెక్యూరిటీ సమస్య అనేదే ఉండదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 21, 2021 at 8:19 ఉద.