Flipkart Big Saving Days Sale : ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సేల్ ను ప్రారంభించనుంది. మార్చి 11 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. మార్చి 11 నుంచి మార్చి 15 వరకు ఈ సేల్ జరగనుంది. ఈ సేల్ లో ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందించనున్నారు. ముఖ్యంగా యాపిల్ ఫోన్లు ఐఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందనున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్ 1, పిక్సెల్ 6ఏ, ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.
ఐఫోన్ లవర్స్ కు ఈ సేల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 14 ఫోన్లను ఈ సేల్ లో తక్కువ ధరకే అందిస్తున్నారు. రూ.60,009 నుంచి రూ.69,999 మధ్యలోనే ఐఫోన్ 14 ను పొందే అవకాశం ఉంది. ఐఫోన్ 14 ప్లస్ అయితే రూ.80 వేలు ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 14 ఫ్లిప్ కార్ట్ లో రూ.71,999 గా ఉంది. ఐఫోన్ 14 ఒరిజినల్ ప్రైస్ రూ.79,999. దానికంటే రూ.8000 తక్కువకే ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది.
Flipkart Big Saving Days Sale : బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో రూ.రూ.60 వేలకే ఐఫోన్ 14
ఐఫోన్ 14 ను ఇప్పుడే రూ.9 వేల డిస్కౌంట్ కు ఫ్లిప్ కార్ట్ లో అందిస్తున్నారు. మార్చి 11 నుంచి ప్రారంభమయ్యే సేల్ లో రూ.60 వేలకే అందించనున్నారు. అలాగే.. నథింగ్ ఫోన్ 1 ని కూడా తక్కువ ధరకే అందించనున్నారు. గూగుల్ పిక్సెల్ 7 ప్రస్తుత ధర రూ.59,999 కాగా, దాన్ని ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో రూ.50 వేలకే అందించనున్నారు. పిక్సెల్ 7 ప్రో ధర కూడా ఈ సేల్ లో తగ్గనుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్లు అన్నింటి మీద ఈ సేల్ లో తక్కువ ధరకే అందిస్తున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ లవర్స్ ఈ సేల్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే పొందొచ్చు.