Google CEO : ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ దిగ్గజం గూగుల్ కంపెనీ కూడా లేఆఫ్స్ ను ఆపలేకపోయింది. ఒకేసారి 12000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్ మాత్రమే కాదు.. దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కాస్ట్ కటింగ్ పేరుతో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.
తాజాగా గూగుల్ సీఈవో తన జీతాన్ని కూడా భారీగా తగ్గించుకున్నారట. కంపెనీ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాక.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లేవల్ నుంచి పైన ఉన్న అన్ని రోల్స్ కు చెందిన ఉద్యోగుల జీతాలు కూడా తగ్గాయట. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్ ను తగ్గించేశారట. సీనియర్ ఉద్యోగులందరికీ ఇక నుంచి పర్ ఫార్మెన్స్ బేస్ తో వార్షిక బోనస్ ఉంటుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే.. ఎంత మేర జీతం కట్ అవుతోంది.. తనకు ఎంత కట్ అవుతుంది.. కట్ అయ్యాక వచ్చే జీతం ఎంత అనే విషయాల గురించి మాత్రం మాట్లాడలేదు.
Google CEO : లేఆఫ్స్ ప్రకటన ముందే పిచాయ్ జీతం భారీగా పెరిగినట్టు వార్తలు
అయితే.. గూగుల్ కంపెనీ లేఆఫ్స్ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే సుందర్ పిచాయ్ జీతం భారీగా పెరిగినట్టు వార్తలు వచ్చాయి. సుందర్ తీసుకొచ్చిన పలు ప్రాడక్ట్స్, ఆయన నిర్ణయాల ఆధారంగా జీతం పెరిగినట్టు వార్తలు వచ్చినా.. అంతలోనే లేఆఫ్స్ ప్రకటించడంతో మళ్లీ ఆయన జీతం కూడా భారీగా తగ్గిందని వార్తలు వస్తున్నాయి. 2020 లో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.16 కోట్లు. కానీ.. మధ్యలో ఆయన జీతం భారీగా పెరిగింది. ఆయన ఆస్తులు మాత్రం రూ.5300 కోట్లు అని, అత్యంత ధనవంతులైన ఐటీ ప్రొఫెషనల్స్ లో ఆయన ఒకరు అని 2022 లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. గూగుల్ తొలగించిన 12000 మంది ఉద్యోగుల్లో చాలామంది 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి పని చేస్తున్నవాళ్లే. అయితే.. లేఆఫ్స్ పర్ ఫార్మెన్స్ ను ఆధారంగా చేసుకొని జరగలేదు. అలాగే అవి రాండమ్ గా సెలెక్ట్ చేసినవి కూడా కాదని సుందర్ పిచాయ్ ఇంటర్నల్ మీటింగ్ లో స్పష్టం చేశారు.