google to launch chatgpt rival platform soon
google to launch chatgpt rival platform soon

Google vs ChatGPT : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చాట్‌జీపీటీ గురించే చర్చ. అవును.. అసలు ఏంటిది.. చాలా యూనివర్సిటీలలో చాట్‌జీపీటీలను బ్యాన్ చేశారు.. చాట్‌జీపీటీ ద్వారా ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుంది. ఇక గూగుల్ సెర్చ్ ఇంజన్ అవసరం లేదు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. నిజానికి చాట్‌జీపీటీ అనేది ఒక ఏఐ చాట్ బాట్. మనం ఏదైనా వెబ్ సైట్‌లోకి వెళ్లినప్పుడు చాట్ బోట్స్ మనకు ఏదైనా సమాచారం గురించి కావాలంటే అప్పటికప్పుడు సమాధానాలు ఇస్తుంటాయి. అవి చాట్ రోబోట్స్ అన్నమాట. అవి మనం అడిగిన ప్రశ్నలను బట్టి డీఫాల్ట్ ఆన్సర్లను అందిస్తుంటాయి.

కానీ.. చాట్‌జీపీటీ వాటికంటే అడ్వాన్స్‌డ్ వర్షన్ అన్నమాట. ఏ విషయం గురించి అడిగినా కూడా వివరంగా అరటిపండును వలిచి నోట్లో పెట్టినట్టుగా చాట్‌జీపీటీ సమాధానాన్ని అందిస్తుంది. దీంతో దానికి చాలా పాపులారిటీ వచ్చేసింది. ఒకేసారి లక్షల మంది ఆ ప్లాట్ ఫామ్‌కు రిజిస్టర్ చేసుకోవడంతో గూగుల్ కంపెనీకి టెన్షన్ స్టార్ట్ అయింది. చాట్‌జీపీటీలో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుండటం, అది కూడా చాలా సులభమైన పద్ధతిలో లభిస్తుండటంతో గూగుల్ సెర్చ్ ఇంజన్‌తో అవసరం ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ఏదైనా సమాచారం గురించి సెర్చ్ చేస్తే పలు రకాల లింక్స్‌ను గూగుల్ అందిస్తుంది. ఆ లింక్స్ ద్వారా మనకు నచ్చిన లింక్ ఓపెన్ చేసి సమాచారాన్ని వెతకొచ్చు.

Google vs ChatGPT : అడ్వాన్స్‌డ్ పవర్‌ఫుల్ టూల్‌ను గూగుల్ తీసుకురానుందా?

ఇటీవల గూగుల్ ఉద్యోగులతో కంపెనీ సీఈవో క్వార్టర్ ఫోర్ లాభాల గురించి మీటింగ్ నిర్వహించారు. అందులో గూగుల్ సెర్చ్ ఇంజన్ గురించి చర్చించారు. ఆ మీటింగ్‌లోనే సెర్చ్ ఇంజన్‌కు అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్ ఫీచర్స్‌ను యాడ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సరికొత్త సెర్చ్, ఎక్స్‌పరిమెంటల్ సెర్చ్ లాంటి ఫీచర్స్ కోసమే లామ్డా(LaMDA) అనే లాంగ్వేజ్ మోడల్‌ను వినియోగించుకొని స్పెసిఫిక్ రిజల్ట్స్‌ను అందించేలా గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పలు మార్పులు చేస్తున్నట్టు సీఈవో వెల్లడించారు. అయితే.. ఇది ఖచ్చితంగా చాట్‌జీపీటీకి పోటీగా వస్తోందని పలువురు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్ ఇంకా వెల్లడించలేదు.