iphone: మొబైల్ అనేది ఇప్పుడు మన జీవితంలో భాగమైంది. మొబైల్స్ వల్ల మానవ జీవనశైలినే మారిపోయింది. ఈ ఆధునిక ప్రపంచంలో కనిపెట్టిన వాటిలో మొబైల్ ప్రత్యేకమైంది. అయితే మొబైల్స్ వల్ల చాల చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు చాల సందర్భాలలో స్మార్ట్ డివైసెస్ మనుషుల ప్రాణాలను కాపాడుతున్నాయి.

ఇప్పటికే చాల సందర్భాల్లో ఆపిల్ వాచ్ లు మనుషుల ప్రాణాలను కాపాడిన సందర్భాలను చాలా చూశాం. అయితే ఇప్పుడు మంచులో వ్యక్తి యొక్క ప్రాణాన్ని ఐఫోన్ కాపాడింది.
41 ఏళ్ల టిమ్ బ్లేకీ స్విస్ పర్వతంపై ఒంటరిగా స్నోబోర్డింగ్ చేస్తున్నాడు. అంతా అతని ప్రణాళిక ప్రకారం జరుగుతోంది, కానీ పర్వతాలలో ఉన్న 15 అడుగుల గోతిలో పడిపోయాడు. అయితే అక్కడ ఎంత అరిచినా,పిలిచినా లేరు. అయితే తన దగ్గర కేవలం 3% ఛార్జింగ్ ఉన్న ఐఫోన్ మాత్రమే ఉంది. అతని అదృష్టం కొద్దీ 3G సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ వచ్చిన వెంటనే సైడ్ బటన్ ను , వాల్యూమ్ బటన్ ను గట్టిగా ఎస్ఓఎస్ వచ్చే వరకు ప్రెస్ చేశాడు . దీంతో ఎమర్జెన్సీ నెంబర్స్ కు కాల్ వెళ్లడంతో అక్కడికి అధికారులు చేరుకొని అతన్ని కాపాడారు. తన ప్రాణాలను కాపాడిన ఐఫోన్, మంచు కొండల్లో సిగ్నల్ వచ్చేలా ఏర్పాట్లు చేసిన నెట్వర్క్ కృతజ్ఞతలు చెప్పారు .
ఐఫోన్‌లో అత్యవసర సేవల ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెల్సుకుందాం.
ఐఫోన్‌లో అత్యవసర సేవలు ఎలా పనిచేస్తాయో మీకు తెలియకపోతే, తెలుసుకోవాల్సినసమయం ఆసన్నమైంది. మీరు SOSతో కాల్ చేసినప్పుడు, మీ iPhone ఆటోమేటిక్ గా స్థానిక అత్యవసర నంబర్‌కు కాల్ చేస్తుంది.
మీ స్క్రీన్‌పై ఎమర్జెన్సీ SOS స్లయిడర్ కనిపించే వరకు సైడ్ బటన్ మరియు వాల్యూమ్ బటన్‌లలో ఒకదానిని కలిపి నొక్కి పట్టుకోండి. ఇలా చేస్తే అత్యవసర నంబర్స్ కు కాల్ వెళ్తుంది. ఈ సెట్టింగ్‌లు iPhone 8 లేదా తర్వాతి వాటికి వర్తిస్తాయి.