how to block customer care and spam calls in jio and airtel networks
how to block customer care and spam calls in jio and airtel networks

Block Spam Calls : ప్రతి ఒక్కరు బాగా ఇరిటేట్ అయ్యే విషయం ఇదే. మనం బిజీగా ఉన్న సమయంలోనో.. లేదా డ్రైవ్ చేస్తున్నప్పుడు, మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్లు చేసి సతాయిస్తుంటారు. టైమ్ పాస్ కాల్స్, టెలీమార్కెటింగ్ కాల్స్, స్పామ్ కాల్స్ ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరికొందరు బ్యాంక్ కాల్స్ అంటూ చేస్తుంటారు. లోన్స్ ఇస్తామంటారు. చిరాకు పెడతారు. వద్దురా బాబు అన్నా వినరు. మీటింగ్ లో ఉన్నాం అన్నా కూడా వినకుండా డిస్టర్బ్ చేస్తుంటారు. అసలు.. ఇటువంటి కాల్స్ ను రాకుండా అడ్డుకోలేమా? దానికి పరిష్కారం లేదా.. అంటే ఉంది.

ఇలాంటి టెలీమార్కెటింగ్, ప్రమోషనల్ స్పామ్ కాల్స్ ను తగ్గించవచ్చు. జియో, ఎయిర్ టెల్, వీఐ లాంటి నెట్ వర్క్స్ ను ఉపయోగించే కస్టమర్లు మీ ఫోన్ నుంచి 1909 నెంబర్ కు మెసేజ్ చేస్తే చాలు. ఇక జన్మలో మిమ్మల్ని వాళ్లు డిస్టర్బ్ చేయరు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటి కాల్స్ ను బ్లాక్ చేస్తే.. తమకు వచ్చే ముఖ్యమైన కాల్స్ కూడా బ్లాక్ అవుతాయి అని అనుకుంటారు. అలాంటి ముఖ్యమైన కాల్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓటీపీలు రావు అనుకుంటారు. కానీ.. అసలు ఓటీపీలకు, ఇలాంటి కాల్స్ కు సంబంధమే ఉండదు.

Block spam Calls : డీఎన్డీ ఎలా యాక్టివేట్ చేయాలి?

మార్కెటింగ్, ప్రమోషనల్, అవసరం లేని స్పామ్ కాల్స్, మెసేజ్ ల కోసం డీఎన్డీని యాక్టివేట్ చేసుకోవాలి. డీఎన్డీ అంటే డు నాట్ డిస్టర్బ్. దాని కోసం FULLY BLOCK అని టైప్ చేసి మీ పర్సనల్ నెంబర్ నుంచి 1909 కు మెసేజ్ పంపించండి. దీని వల్ల అన్ని రకాల మార్కెటింగ్ కాల్స్ ఆగిపోతాయి. ఒకవేళ స్పెసిఫిక్ గా కొన్ని కేటగిరీలకు సంబంధించిన కాల్స్ ను మాత్రమే బ్లాక్ చేయాలనుకుంటే.. BLOCK 1 అని టైప్ చేసి 1909 కు మెసేజ్ చేయండి. దాని వల్ల.. బ్యాంకింగ్, ఇన్సురెన్స్, క్రెడిట్ కార్డ్స్, ఫైనాన్సియల్ ప్రాడక్ట్స్ కు సంబంధించిన కాల్స్ బ్లాక్ అవుతాయి.

BLOCK 2 అని టైప్ చేసి 1909 నెంబర్ కు మెసేజ్ చేస్తే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కాల్స్ ను బ్లాక్ చేసుకోవచ్చు. BLOCK 3 అని మెసేజ్ చేస్తే ఎడ్యుకేషన్, రిలేటెడ్ స్పామ్స్ కాల్స్ ను బ్లాక్ చేయొచ్చు. హెల్త్ కాల్స్ బ్లాక్ చేయడానికి BLOCK 4, ఆటోమొబైల్స్, ఎంటర్ టైన్ మెంట్, ఐటీ కాల్స్ బ్లాక్ చేయడానికి BLOCK 5, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ కోసం BLOCK 6, టూరిజం, లీజర్ కోసం BLOCK 7, ఫుడ్ అండ్ బేవరేజెస్ కోసం BLOCK 8 కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.

లేదంటే.. జియో నెట్ వర్క్ వినియోగించే వాళ్లు మైజియో యాప్ కు వెళ్లి అందులో సెట్టింగ్స్ లో డునాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్, వీఐ నెట్ వర్క్ వినియోగించేవాళ్లు కూడా వాటికి సంబంధించిన యాప్స్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ లో డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే చాలు. అలాంటి కాల్స్ ఇక జన్మలో రావు.