How To Check TS Police E-Challan Status : రోడ్డు మీద ఏదైనా వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. ఒకప్పుడు అంటే వాహనాన్ని ఆపి పోలీసులు ఫైన్ వేసేవారు. కానీ.. ఇప్పుడు వాహనాన్ని ఆపాల్సిన అవసరమే లేదు. అది బైక్ అయినా కారు అయినా మరే వాహనం అయినా అది ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు అని తెలిస్తే చాలు. దాన్ని ఆపకుండానే వెహికిల్ నెంబర్ తో ఆన్ లైన్ లో చలాన్ విధిస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో ఆ వాహన యజమాని చెక్ చేసుకొని ఫైన్ పే చేయొచ్చు. ఫైన్ పే చేయడానికి కొంత సమయం కూడా ఇస్తారు. ఆ టైమ్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలకు ఫైన్ వేస్తుంటారు పోలీసులు.
ఇప్పుడు అంతా ఆన్ లైన్ కాబట్టి.. ఫైన్ ను కూడా ఆన్ లైన్ లోనే వేస్తున్నారు కాబట్టి దాన్ని ఈ చలాన్ అంటారు. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్ కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను తీసుకొచ్చారు. అది https://echallan.tspolice.gov.in/ అనే వెబ్ సైట్. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి చలాన్ ను పే చేసుకోవచ్చు. ఒక వాహనం పేరు మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన https://echallan.parivahan.gov.in/ అనే వెబ్ సైట్ లోనూ చలాన్ వివరాలు తెలుసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేసి పే ఆన్ లైన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని మీ చలాన్ నెంబర్, వాహనం నెంబర్, డీఎల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డిటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ చలాన్ వివరాలు వస్తాయి. అక్కడ పే నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చలాన్ అమౌంట్ ను ఆన్ లైన్ లో పే చేయొచ్చు.
How To Check TS Police E-Challan Status : పరివాహన్ పోర్టల్ ద్వారా ఎలా టీఎస్ చలాన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి?
దాని కోసం పరివాహన్ వెబ్ సైట్ కి లాగిన్ అయి.. చెక్ ఆన్ లైన్ సర్వీసెస్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ చెక్ చలాన్ స్టేటస్ ను క్లిక్ చేయాలి. అక్కడ డీఎల్ నెంబర్ లేదా వెహికిల్ నెంబర్ ను ఎంటర్ చేయలి. మీకు ఒకవేళ చలాన్ ఇష్యూ చేసి ఉంటే.. చలాన్ వివరాలు అక్కడ కనిపిస్తాయి. ఆ వివరాలను చెక్ చేసుకొని పరివాహన్ వెబ్ సైట్ లేదా టీఎస్ పోలీస్ వెబ్ సైట్ లోకి వెళ్లి అయినా చలాన్ ఫైన్ ను పే చేసుకోవచ్చు.
ఒకవేళ ఈ పోర్టల్స్ కి వెళ్లకుండా.. పేటీఎం యాప్ ద్వారా కూడా పోలీస్ చలాన్ పే చేయొచ్చు. పేటీఎం యాప్ ఓపెన్ చేసి రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఆప్షన్ లోకి వెళ్లి అక్కడ మై బిల్స్ అండ్ రీచార్జెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని.. ట్రాన్సిట్ సెక్షన్ లో చలాన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని పే ట్రాఫిక్ చలాన్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ వాహనం నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టాలి. అక్కడ మీ వాహనం మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయి. ఎంత పెండింగ్ ఫైన్ ఉంది అన్ని వివరాలు చూపిస్తాయి. దాని మీద క్లిక్ చేసి ఆన్ లైన్ లో పే చేయండి.