How to continue to use google photos for free
How to continue to use google photos for free

Google Photos : గూగుల్ అంటేనే అదో పెద్ద ప్రపంచం. గూగుల్ సెర్చ్ ఇంజనే పెద్ద వండర్. ప్రపంచంలోని ఏ సమాచారం కావాలన్నా.. క్షణాల్లో మన ముందుకు తీసుకొస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజన్. గూగుల్ కంపెనీ ఒక్క సెర్చ్ ఇంజన్ మాత్రమే కాదు.. పలు రకాల సర్వీసులను అందిస్తోంది. అందులో ఒకటి గూగుల్ ఫోటోస్. వందలు, వేల జీబీలు ఉన్న ఫోటోలను పర్సనల్ కంప్యూటర్లలో దాచుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే.. పీసీలలో, లాప్ టాప్ లలో వందలు, వేల జీబీ ఉండే హార్డ్ డిస్క్ ఉండదు. ఉన్నా కూడా.. కేవలం ఫోటోలను దాచుకోవడం కోసమే.. అంత మెమోరీని ఉపయోగించలేం. అందుకే.. గూగుల్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ గూగుల్ ఫోటోస్. మొదట్లో ఉచితంగానే గూగుల్ ఫోటోస్ ఫీచర్ అందుబాటులో ఉండేది. అలాగే అన్ లిమిటెడ్ స్టోరేజ్ ఉండేది. కానీ.. ఇప్పుడు ఉచితంగా గూగుల్ ఫోటోస్ స్టోరేజీని అందించడాన్ని గూగుల్ ఆపేసింది. అన్ లిమిటెడ్ స్టోరేజ్ ఆఫ్షన్ కూడా ఇప్పుడు లేదు. ఇదివరకే గూగుల్ ఫోటోస్ లో ఫోటోలను స్టోర్ చేసుకొని ఉంటే పర్వాలేదు కానీ.. ఇప్పుడు కొత్తగా గూగుల్ ఫోటోస్ ఫీచర్ ను ఉపయోగించాలంటే మాత్రం ఉచితంగా కుదరదు. అలాగే.. అన్ లిమిటెడ్ స్టోరేజ్ కూడా లేకుండా.. కేవలం 15 జీబీలోనే ముందు ఫోటోలను స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 15 జీబీ దాటితే గూగుల్ ఫోటోస్ ప్రీమియం ఆప్షన్ ను తీసుకోవాల్సిందే.

How to continue to use google photos for free
How to continue to use google photos for free

అయితే.. గూగుల్ ఫోటోస్ ను ఉచితంగా ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఉపయోగించుకోవచ్చు. అన్ లిమిటెడ్ స్టోరేజ్ లేదు కదా అని టెన్షన్ పడకండి. ఎలా గూగుల్ ఫోటోస్ ను ఉచితంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు 15 జీబీ వరకు ఉచితంగా వాడుకోవచ్చు. 15 జీబీ దాటితే అప్పుడు పెయిడ్ వర్షన్ కు అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే.. ఫోటోల్లో కొన్ని మార్పులు చేయాలి. ఫోటో క్వాలిటీని మార్చాలి. ఫోటో క్వాలిటీ డీఫాల్ట్ గా Original ఉంటుంది. దాన్న High కి మార్చుకోవాలి. దాని వల్ల మీకు చాలా ఫ్రీ స్పేస్ మిగులుతుంది. దాని కోసం సెట్టింగ్స్ కు వెళ్లి.. ఫోటో క్వాలిటీని Original నుంచి High కి మార్చండి. దాని వల్ల కనీసం 40 శాతం వరకు స్పేస్ మిగులుతుంది.

Google One అనే ఫీచర్ ను ఉపయోగించి.. అనవసరమైన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసేయండి. Google One లో Manage storage section లోకి వెళ్లి స్పేస్ ను ఫ్రీ అప్ చేసుకోండి.

అలాగే.. Review Tool  ను ఉపయోగించండి. రివ్యూ టూల్ వల్ల.. అనవసరమైన, బ్లర్ గా ఉండే ఫోటోలను చెక్ చేసుకోవచ్చు. అవసరం లేని ఫోటోలు, క్లియర్ గా లేని ఫోటోలు, బ్లర్ గా ఉన్న ఫోటోలను రివ్యూ టూల్ ద్వారా తెలుసుకొని వాటిని డిలీట్ చేసుకోవచ్చు. దాని వల్ల.. ఇంకాస్త స్పెస్ ను పొందొచ్చు.

Google Photos : గూగుల్ ఫోటోస్ కు ఆల్టర్నేట్ గా ఉన్న ఆన్ లైన్ ఫ్రీ స్టోరేజ్ సర్వీసులు ఇవే

ఒకవేళ గూగుల్ ఫోటోస్ వద్దు అని అనుకుంటే.. దాని కన్నా బెటర్ టాప్ ఆన్ లైన్ ఫ్రీ స్టోరేజ్ సర్వీసులు చాలా ఉన్నాయి. వాటిలో మొదటిది Mega. దీంట్లో ఉచితంగా 50 జీబీ వరకు మెమోరీని ఉపయోగించుకోవచ్చు. తర్వాత DigiBoxx. కేవలం 300 రూపాయలు పే చేస్తే 100 జీబీల స్టోరేజ్ ను ఉచితంగా పొందొచ్చు. డబ్బులు కట్టకున్నా.. ఉచితంగా 20 జీబీ వరకు ఉపయోగించుకోవచ్చు. అలాగే.. Amazon Photos ను ఉచితంగా Amazon prime సబ్ స్క్రిప్షన్ తో పొందొచ్చు. Microsoft OneDrive, Icedrive, Apple iCloud, Apple One లాంటి చాలా సర్వీసులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

లేదు మాకు గూగుల్ ఫోటోస్ మాత్రమే కావాలి అని అనుకుంటే మాత్రం.. ఉచితం 15 జీబీ వరకు మాత్రమే గూగుల్ ఫోటోస్ లో స్టోరేజ్ ను ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే మాత్రం నెలకు 130 రూపాయలు కడితే.. 100 జీబీల స్టోరేజ్ ను పొందొచ్చు. సంవత్సరానికి 1300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 2 టీబీ స్టోరేజ్ కావాలంటే.. మరో ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 10, 2021 at 7:39 సా.