how to download google photos to personal computer
how to download google photos to personal computer

Google photos : ఈరోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫోన్ కెమెరాతో అక్కడి అందాలను బంధించేయడం, విరివిగా ఫోటోలు దిగడం అలవాటుగా మారింది. అయితే… ఫోటోలు దిగడం వరకు ఓకే కానీ… ఆ ఫోటోలను ఎక్కడ దాచుకోవాలి. వేల కొద్దీ ఫోటోలు ఉంటే.. ఫోన్ లో మెమెరీ ఫుల్ అయిపోతుంది. కంప్యూటర్ లో దాచుకుందామంటే కంప్యూటర్ మెమెరీ కూడా ఫుల్ అయిపోతుంది. అటువంటప్పుడు అందరికీ గుర్తొచ్చే ఒకే ఒకటి గూగుల్ ఫోటోస్(google photos). గూగుల్ ఫోటోస్ టూల్ లో కావాల్సినన్ని ఫోటోలు ఉచితంగా దాచుకోవచ్చు. ఎన్నేళ్లయినా దాచుకోవచ్చు. ఎప్పుడైనా వాటిని చూడాలనుకుంటే.. గూగుల్ ఫోటోస్ లోకి వెళ్లి చూసుకోవచ్చు.

how to download google photos to personal computer
how to download google photos to personal computer

అయితే… ఒక్కోసారి గూగుల్ ఫోటోస్ లో ఉన్న ఫోటోలను పర్సనల్ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. గూగుల్ ఫోటోలను అన్నింటినీ ఒకేసారి గూగుల్ ఫోటోస్ నుంచి పీసీలోకి డౌన్ లోడ్ చేసుకోవడం చాలామందికి తెలియదు. ఆ సమయంలో చాలామంది వేరే థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఫోటోలను డౌన్ లోడ్ చేస్తుంటారు. ఆ సాఫ్ట్ వేర్ కోసం డబ్బులు కూడా పే చేస్తుంటారు కొందరు.

కానీ… రూపాయి ఖర్చు లేకుండా… అన్ని గూగుల్ ఫోటోలను మీ పర్సనల్ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం గూగుల్ కంపెనీనే ఒక కొత్త టూల్ ను డెవలప్ చేసింది. ఆ టూల్ ను ఉపయోగించి ఉచితంగా మీ గూగుల్ ఫోటోలను మీ పీసీలోకి కానీ… ఇంకా వేరే క్లౌడ్ స్టోరేజ్ లోకి కానీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Google Photos : ఆ టూల్ పేరేంటి? టూల్ ద్వారా ఫోటోలు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?

ఆ టూల్ పేరు Google Takeout. గూగుల్ టేక్ ఔట్ ద్వారా ఫోటోలను ఎలా పీసీలోకి డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీరు https://myaccount.google.com/ లింక్ మీద క్లిక్ చేసి… Google Account management page లోకి వెళ్లండి. ఒకవేళ మీరు మీ జీమెయిల్ కు లాగిన్ అయి ఉండకపోతే.. మీ జీమెయిల్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవండి.
  • ఆ తర్వాత… Data & personalization అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • అక్కడ… Download your data option ను క్లిక్ చేయండి
  • అప్పుడు మీరు గూగుల్ టేక్ ఔట్ పేజీలోకి వెళ్తారు. అక్కడ అన్ని ఆప్షన్లను డీసెలెక్ట్ చేయండి. ఎందుకంటే మీరు కేవల గూగుల్ ఫోటోలను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి.. కేవలం Google photos ఆప్షన్ ను మాత్రమే సెలెక్ట్ చేయండి. మిగితా వన్నీ డీ సెలెక్ట్ చేయాలి.
how to download google photos to personal computer
how to download google photos to personal computer
how to download google photos to personal computer
how to download google photos to personal computer
  • Next step బటన్ మీద క్లిక్ చేయండి
  • అక్కడ Delivery method ను సెలెక్ట్ చేసుకోండి.
how to download google photos to personal computer
how to download google photos to personal computer
  • తర్వాత File type & size కు సంబంధించిన ఆప్షన్లను ఇవ్వండి. తర్వాత Create Export బటన్ మీద క్లిక్ చేయండి. అంతే మీ గూగుల్ ఫోటోలు అన్నీ మీ పర్సనల్ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ అవుతాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 22, 2021 at 12:00 సా.