how to download microsoft windows 11 operating system
how to download microsoft windows 11 operating system

Microsoft Windows 11 : మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడేది మైక్రోసాఫ్ట్ ఓఎస్ నే. పర్సనల్ కంప్యూటర్ అయిన డెస్క్ టాప్, లాప్ టాప్ లలో ఎక్కువగా మైక్రోసాఫ్ట్ ఓఎస్ నే వాడుతుంటారు. అలాగే.. ఎక్కువ కంపెనీలు కూడా వాడేది మైక్రోసాఫ్ట్ ఓఎస్ నే. మైక్రోసాఫ్ట్ తమ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటుంది. అయితే.. 6 ఏళ్ల కింద విండోస్ 10 ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అప్పటి నుంచి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను తీసుకురాలేదు. ఎందుకంటే.. మైక్రోసాఫ్ట్.. కనీసం ఓ సంవత్సరం, రెండు సంవత్సరాలకు కొత్త ఓఎస్ ను తీసుకొచ్చేది. విండోస్ ఎక్స్ పీ, 7, 8, విస్టా.. ఆ తర్వాత విండోస్ 10 వచ్చింది.

how to download microsoft windows 11 operating system
how to download microsoft windows 11 operating system

విండోస్ 10 వచ్చిన ఆరేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ తన సరికొత్త ఓఎస్ ను తీసుకొచ్చింది. దాని పేరుకు మైక్రోసాఫ్ట్ విండోస్ 11 గా నామకరణం చేసింది. దీన్ని ఇటీవలే మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్చువల్ గా లాంచ్ చేసింది. విండోస్ 10 కంటే కూడా అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో విండోస్ 11ను మైక్రోసాఫ్ట్ మార్కెట్ లోకి విడుదల చేసింది. విండోస్ 11 మొత్తం మొబైల్ ఫ్రెండ్లీగా ఉండబోతోందని ప్రకటించింది.

how to download microsoft windows 11 operating system
how to download microsoft windows 11 operating system

Microsoft Windows 11 : కొత్త ఓఎస్ ను ఎలా డౌన్ లోన్ చేసుకోవాలి?

మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ను మైక్రోసాఫ్ట్ ఉచితంగానే అందిస్తోంది. ఇప్పటికే జెన్యూన్ విండోస్ 10 ఓఎస్ ను వాడుతున్న వాళ్లు.. ఉచితంగా.. మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఓఎస్ కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన అప్ గ్రేడ్ ప్రక్రియను ప్రారంభిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే.. 2022 నుంచి కొత్త ఓఎస్ పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

how to download microsoft windows 11 operating system
how to download microsoft windows 11 operating system

Microsoft Windows 11 : విండోస్ 11 ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. సిస్టమ్ రిక్వైర్ మెంట్స్ ఏంటి?

మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. ఖచ్చితంగా విండోస్ 10 జెన్యూస్ వర్షన్ వాడుతుండాలి. అలాగే.. 64 జీబీ మెమోరీ ఉండాలి. కనీసం 4 జీబీ ర్యామ్ ఉండాలి. అలా అయితేనే.. విండోస్ 11 ను ఇన్ స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

how to download microsoft windows 11 operating system
how to download microsoft windows 11 operating system

Microsoft Windows 11 : కొత్త ఓఎస్ ఫీచర్స్ ఏంటి?

కొత్త ఓఎస్ లో డెస్క్ టాప్ మీదనే అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ కనిపిస్తాయి. విండోస్ 11 ద్వారా గేమింగ్ కోసం కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అయితే.. విండోస్ 11 లో స్టార్ట్ బటన్.. లెఫ్ట్ సైడ్ కాకుండా.. స్క్రీన్ కు సెంటర్ లో ఉంటుంది. మీకు కావాల్సిన ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. పీసీలో కూడా యాప్ ను ఓపెన్ చేసి వాడుకోవచ్చు. అలాగే.. ఎక్స్ క్స్ గేమ్స్ పాస్ ను కూడా విండోస్ 11 లో అందిస్తారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 28, 2021 at 9:50 ఉద.