how to increase laptop battery life tips
how to increase laptop battery life tips

Laptop Battery Life : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ను ఎలా ఉపయోగిస్తున్నారో.. లాప్ టాప్ ను కూడా అలాగే ఉపయోగిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా.. లాప్ టాప్ ను ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు. చిన్న చిన్న కంప్యూటర్ పనుల కోసం కూడా లాప్ టాప్ ఉండాల్సిందే. అందుకే.. ప్రతి ఇంట్లో లాప్ టాప్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే.. చాలామంది లాప్ టాప్ వాడేవాళ్లు పడే టెన్షన్ ఒక్కటే. అదే బ్యాటరీ ఆగకపోవడం. లాప్ టాప్ ను ఒకసారి ఫుల్ చార్జ్ చేశాక.. కనీసం రెండు మూడు గంటలు కూడా రాదు. దాని వల్ల.. పవర్ పోయినా.. లేదా ట్రావెల్ లో ఉన్నా.. వేరే ప్రదేశాల్లో ఉన్నా.. వెంటనే చార్జ్ అయిపోతే చాలా టెన్షన్ పడతారు. ఫోన్ చార్జింగ్ అంటే ఎక్కడో ఒకచోట పెట్టుకోవచ్చు కానీ.. లాప్ టాప్ చార్జింగ్ కోసం మాత్రం చాలా కష్టపడాలి. ఎక్కడా దొరకవు.

how to increase laptop battery life tips
how to increase laptop battery life tips

అసలు.. లాప్ టాప్ చార్జింగ్ అంతేనా. లాప్ టాప్ చార్జింగ్ ను పెంచుకోలేమా? అనే డౌట్ చాలామందికి వస్తుంది. అయితే.. లాప్ టాప్ చార్జింగ్ ను పెంచుకోవచ్చు. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే లాప్ టాప్ బ్యాటరీ లైఫ్ చాలావరకు పెరుగుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి.

Laptop Battery Life : లాప్ టాప్ బ్యాటరీ లైఫ్ ను ఇలా పెంచుకోండి

చాలామంది లాప్ టాప్ డిస్ ప్లేను చాలా ఎక్కువగా పెడుతుంటారు. కానీ.. డిస్ ప్లే లైట్ ను మొత్తం పెట్టుకోకూడదు. దాన్ని ఎప్పుడూ డిమ్ గా ఉంచాలి. అప్పుడే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అవసరం ఉంటేనే వైఫై, బ్లూటూత్ లాంటి వాటిని వాడండి. అవసరం లేకపోతే.. వాటిని టర్న్ ఆఫ్ చేయండి.

అవసరం ఉంటేనే.. యూఎస్బీ పెన్ డ్రైవ్ కానీ.. ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ ను కానీ వాడండి. అవసరం లేకపోతే.. వాటిని వెంటనే డిస్ కనెక్ట్ చేయండి. కొందరు లాప్ టాప్ ను చార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తారు. దాన్ని వాడకున్నా కూడా చార్జింగ్ పెట్టి.. ఆన్ చేసి వదిలేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. కంటిన్యూగా లాప్ టాప్ ను చార్జ్ చేయకండి. లాప్ టాప్ చార్జింగ్ ఫుల్ కాగానే.. చార్జింగ్ ఆఫ్ చేయండి. మళ్లీ.. చార్జింగ్ 20 శాతం కంటే తక్కువ అయితే.. అప్పుడు మళ్లీ చార్జింగ్ పెట్టండి. అలా అయితేనే బ్యాటరీ లైఫ్ ఎక్కువ సేపు ఉంటుంది.

how to increase laptop battery life tips
how to increase laptop battery life tips

లాప్ టాప్ చార్జింగ్ ను 100 శాతం ఫుల్ గా చేయండి. బ్యాక్ గ్రౌండ్ లో అవసరం లేని ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని వెంటనే డియాక్టివేట్ చేయండి. షెడ్యూల్డ్ టాస్క్స్, యాంటీ వైరస్ స్కాన్ లేదా సాఫ్ట్ వేర్ అప్ డేట్ లాంటి వాటిని డిసేబుల్ చేయండి.

సీడీ, డీవీడీ డ్రైవ్ లో సీడీలను, డీవీడీలను అలాగే పెట్టి ఉంచకండి. వాటి పని అయిపోగానే.. వాటిని తీసేయండి. ఎప్పుడూ సీడీ, డీవీడీ డ్రైవ్ ఖాళీగా ఉండాలి. స్క్రీన్ సేవర్ లాంటిది ఏదీ సెట్ చేసుకోకండి. దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. లాప్ టాప్ తో పాటు వచ్చిన అడాప్టర్ నే చార్జింగ్ కోసం వాడండి. ఇతర అడాప్టర్ లను వాడితే.. లాప్ టాప్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 13, 2021 at 7:06 సా.