Instagram : ఈరోజుల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఫేస్ బుక్ కు భారీగా పాపులారిటీ ఉండేది. కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో ఇన్ స్టాకు చాలా క్రేజ్ వచ్చేసింది. ఎవరు చూసినా రీల్స్ చేస్తూ, రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ టాలెంట్ మొత్తం రీల్స్ లో చూపిస్తున్నారు. ఒకప్పుడు టిక్ టాక్ కు ఎంత క్రేజ్ ఉండేదో.. ఇప్పుడు ఆ క్రేజ్ ఇన్ స్టా కు వచ్చేసింది. అందుకే ఇన్ స్టా లో ఉన్న ఫీచర్స్ గురించి చాలామంది వెతుకుతున్నారు. సరికొత్త ఫీచర్స్ తెలుసుకొని ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే.. ఇన్ స్టాను చాలామంది స్మార్ట్ ఫోన్లలోనే ఉపయోగిస్తుంటారు. అయితే.. మన ఇన్ స్టాను ఎవరైనా వాడుతున్నారా అనే డౌట్ కొందరికి వస్తుంది. అంటే.. తెలిసిన వాళ్లే మన యూజర్ నేమ్, పాస్ వర్డ్ తెలుసుకొని మన ఇన్ స్టాను వాడే అవకాశం ఉంటుంది. అలా ఇన్ స్టాను ఎవరైనా వాడుతున్నట్టు అనుమానం వస్తే దాని కోసం మీరు సింపుల్ గా ఇలా చేస్తే చాలు. ఎవరు వాడుతున్నారో.. ఏ డివైజ్ లో లాగిన్ అయ్యారో.. ఎప్పుడు లాగిన్ అయ్యారో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
Instagram : ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే ఇలా చేయండి
మీరు వెంటనే ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ పైన కార్నర్ లో ఉండే మూడు గీతల మీద క్లిక్ చేయండి. అక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే అక్కడ అకౌంట్స్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు అకౌంట్ సెట్టింగ్స్ కనిపిస్తాయి. పాస్ వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ అక్కడ ఉంటుంది.
దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేస్తే అక్కడ మీకు అకౌంట్ లాగిన్ యాక్టివిటీ కనిపిస్తుంది. అందులో మీరు మీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఏ డివైజ్ లలో లాగిన్ అయ్యారో చూపిస్తుంది.
అందులో మీకు అనుమానంగా ఏదైనా డివైజ్ కనిపిస్తే వెంటనే ఆ డివైజ్ మీద క్లిక్ చేసి లాగవుట్ కొట్టండి. అంతే ఆ డివైజ్ నుంచి మీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లాగవుట్ అవుతుంది. మీ ఇన్ స్టాను వేరే వాళ్లు లాగిన్ అయ్యారని కన్ఫమ్ అయితే వెంటనే పాస్ వర్డ్ మార్చేసుకోండి.