How to Link Aadhar to Mobile Number : ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ప్రభుత్వానికి సంబంధించి ఏ పని జరగాలన్న ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. అయితే ఆధార్ కార్డును మీ ఫోన్ నెంబర్ తో లింక్ చేయడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డు ను మీ ఫోన్ నెంబర్ తో లింక్ చేయడం ద్వారా మీరు సులువుగా మీ వ్యక్తిగత వివరాలను సవరించుకోవచ్చు.ఆన్లైన్ లో ఆధార్ కార్డు కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోలేము,ఇందుకు తప్పకుండా ఆధార్ సెంటర్ లేదా మీ -సేవ సెంటర్ కు వెళ్ళాలి.
How to Link Aadhar to Mobile Number, Steps To Follow : ఆధార్ కార్డు ను మొబైల్ నెంబర్ తో ఎలా లింక్ చేస్కోవాలి
- దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లండి.
- ఆధార్ సెంటర్ నుంచి ఆధార్ కరెక్షన్/అప్ డేట్ ఫారాన్ని పొందండి. మీరు ఈ ఫారాన్ని యుఐడిఎఐ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ఫారాన్ని నింపి సబ్మిట్ చేయండి. మీరు మొబైల్ నెంబరు అప్ డేట్ చేయాల్సి ఉందని ఆ ఫారమ్ లో మీరు పేర్కొనాల్సి ఉంటుంది.
- పాస్ పోర్ట్ లేదా పాన్ కార్డు వంటి మీ గుర్తింపు కార్డు యొక్క ఫోటోకాపీని మీరు తీసుకోవాలి.
- మీరు ఆధార్ సెంటర్ వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవలి .
- ఎక్ నాలెడ్జ్ మెంట్ స్లిప్ మీకు సెంటర్ వద్ద ఇవ్వబడుతుంది మరియు మీ నెంబరు 10 రోజుల్లో మీ ఆధార్ కు లింక్ చేయబడుతుంది.
మీ మొబైల్ నెంబరును మీ ఆధార్ కు లింక్ చేసిన తరువాత దానిని మార్చుకోవాలనుకుంటే , మీరు దానిని ఆన్ లైన్ లో చేయవచ్చు. కానీ ధృవీకరణ కోసం ఒటిపి రిజిస్టర్ చేయబడిన మునుపటి నంబర్ కు పంపబడుతుంది.
- యుఐడిఎఐ వెబ్ సైట్ కు వెళ్లి ఆధార్ ఆన్ లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి.
- అప్డేట్ ఆధార్ డీటైల్స్ పై క్లిక్ చేస్తే ఆధార్ సెల్ఫ్ సర్విస్ అప్డేట్ పోర్టల్ కు వెళ్తారు .
- ‘click here ‘ పై క్లిక్ చేయండి .
- మీ ఆధార్ నెంబరు మరియు కాప్చా కోడ్ నమోదు చేసి “send otp” పై క్లిక్ చేయండి.
- ఓటిపిని సబ్మిట్ చేసిన తర్వాత వివరాలను అప్డేట్ చేయాల్సిన పేజీ కు వెళ్తారు .
- మొబైల్ నెంబరు ఫీల్డ్ కు వెళ్లి మీ కొత్త నెంబరును సబ్మిట్ చేయండి.