how to mute whatsapp contacts and groups forever
how to mute whatsapp contacts and groups forever

Whatsapp Mute : వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చదువుకున్నవాళ్లు అయినా.. చదువుకోని వాళ్లు అయినా.. ఎవ్వరైనా సరే.. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి వాట్సప్ సుపరిచితమే. ఫోన్ లో ఇంత డేటా ఉంటే చాలు.. ఉచితంగా ఎవ్వరికైనా కాల్స్ చేసుకునే అవకాశం. చాట్ చేసే అవకాశం. వీడియో కాల్ చేసే అవకాశం కూడా ఇందులో ఉంది. అందుకే.. వాట్సప్ కు ఆదరణ పెరిగింది. ఇదివరకు ఫోన్ చేయాలంటే రీచార్జ్ చేయించుకొని ఫోన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సప్ ఉంటే చాలు.. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఎంత సేపైనా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎంతసేపైనా వీడియో కాల్ చేసుకోవచ్చు. వందల వేల మెసేజ్ లు అయినా పంపించుకోవచ్చు ఉచితంగా. అందుకే.. వాట్సప్ కు ఆదరణ పెరిగింది. పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్ లో చూసినా వాట్సప్ ఉండాల్సిందే.

how to mute whatsapp contacts and groups forever
how to mute whatsapp contacts and groups forever

రోజురోజుకూ వాట్సప్ కు పెరుగుతున్న డిమాండ్, పాపులారిటీకి అనుగుణంగా వాట్సప్ కూడా తమ యాప్ లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను తీసుకొస్తోంది. యూజర్లకు కావాల్సిన ఫీచర్లను తీసుకొస్తూ.. యూజర్లకు యూజర్ ఫ్రెండ్లీ గా ఉండేలా యాప్ ను తీర్చిదిద్దుతోంది వాట్సప్. ఇప్పటికే చాలా ఆప్షన్లను తీసుకొచ్చిన వాట్సప్ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను మన ముందుకు తీసుకొచ్చింది.

Whatsapp Mute : మీకు ఇష్టం లేని గ్రూప్స్, కాంటాక్ట్స్ ను శాశ్వతంగా మ్యూట్ చేయొచ్చు

కొందరు వాట్సప్ లలో కావాలని చాట్ చేస్తూ.. వీడియో కాల్స్ చేస్తూ.. విసిగిస్తుంటారు. మరికొందరు ఏ గ్రూప్ లో పడితే ఆ గ్రూప్ లో యాడ్ చేస్తుంటారు. కొందరికి ఇవి నచ్చవు. వాళ్లకు నచ్చిన గ్రూప్ తప్పించి.. మిగితా గ్రూప్స్ లో ఎక్కువగా ఉండరు. అందుకే.. అటువంటి వాళ్ల కోసమే వాట్సప్ ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే మ్యూట్ ఆప్షన్. మీకు ఎవరైనా నచ్చకపోతే.. వాళ్ల ఫోన్ నెంబర్ ను శాశ్వతంగా మ్యూట్ లో పెట్టాలనుకున్నా.. లేదా ఏదైనా గ్రూప్ ను శాశ్వతంగా మ్యూట్ లో పెట్టాలనుకున్నా.. ఈ ఆప్షన్ ద్వారా పెట్టేయొచ్చు. వాళ్లు ఇక జన్మలో మీ జోలికి రారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.20.201.10 వర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

త్వరలోనే ఈ ఆప్షన్ ను అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లకు అప్ డేట్ చేయనున్నారు. సాధారణంగా Mute అనే ఆప్షన్ అందరికీ తెలుసు. Block notifications, mute notifications, block, report లాంటి ఆప్షన్లు కూడా మనకు తెలుసు. చాలామంది block notifications అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే.. నోటిఫికేషన్లు మాత్రమే బ్లాక్ అవుతాయి. ఒకవేళ Mute Always అనే ఆప్షన్ ను ఉపయోగిస్తే.. ఆ యూజర్ కానీ.. గ్రూప్ నుంచి కానీ.. శాశ్వతంగా నోటిఫికేషన్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 26, 2021 at 4:09 సా.