Password Protect : చాలామంది ముఖ్యమైన డాక్యుమెంట్లను, చాలామందికి షేర్ చేయాలనుకునే డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేస్తుంటారు. లేదా వేరే వాళ్లు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్ ద్వారా పంపిస్తుంటారు. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ముందు జీమెయిల్ కు లాగిన్ అవ్వాల్సిందే. జీమెయిల్ కు లాగిన్ అవ్వకుండా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి.. గూగుల్ డ్రైవ్ లో ఉండే డాక్యుమెంట్లన్నీ సెక్యూర్డ్ గానే ఉంటాయని అనుకుంటాం. అందుకే… ఎక్కువగా గూగుల్ డ్రైవ్ లో డాక్యుమెంట్లను సేవ్ చేస్తుంటాం. కానీ.. గూగుల్ డ్రైవ్ లో ఉన్నా కూడా ఆ డాక్యుమెంట్లు సురక్షితం కాదు. ఎప్పుడు ఎవరు మీ గూగుల్ డ్రైవ్ ను హాక్ చేసి అందులోని డేటాను దొంగలిస్తారో తెలియదు. ఈమధ్య హ్యాకర్స్ బాగా తెగించేశారు. ఎలాగైనా హ్యాక్ చేసేస్తున్నారు. అందుకే.. మీ గూగుల్ డ్రైవ్ లో ముఖ్యమైన ఫైల్స్ ఏవైనా ఉంటే… వాటికి పాస్ వర్డ్ ను ఇలా సెట్ చేసుకోండి. అప్పుడు మీ గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ను ఎవ్వరూ ఓపెన్ చేయలేరు.

గూగుల్ డ్రైవ్ లో ఉన్న డాక్యుమెంట్లను, పీడీఎఫ్ ఫైల్స్ కు పాస్ వర్డ్ పెట్టుకోవడం కోసం సరికొత్తగ వచ్చిన గూగుల్ డ్రైవ్ యాడ్ ఆన్ పీడీఎప్ టూల్ బాక్స్ (PDF toolbox). పీడీఎఫ్ టూల్ బాక్స్ ను ఉపయోగించి.. పీడీఎఫ్ ఫైల్స్ కు పాస్ వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అలాగే.. పాస్ వర్డ్ సెట్ చేసి ఉన్న డాక్యుమెంట్లను అన్ లాక్ కూడా చేసుకోవచ్చు.
Password Protect : ఎలా పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి?
దాని కోసం ముందుగా పీడీఎఫ్ టూల్ బాక్స్ యాడ్ ఆన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత గూగుల్ డ్రైవ్ కు వెళ్లి.. మీరు పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలనుకున్న డాక్యుమెంట్ ను సెలెక్ట్ చేసి, PDF toolbox ఓపెన్ చేసి… Encrypt PDF అనే సెక్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ output file name ఇవ్వండి. ఆ తర్వాత పాస్ వర్డ్ ఎంటర్ చేయండి. అలాగే.. మీరు పాస్ వర్డ్ సెట్ చేసుకున్న డాక్యుమెంట్ కు ఇతర యాక్సెస్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా అక్కడే ఇవ్వొచ్చు. ఉదాహరణకు ప్రింటింగ్, కామెంట్స్ లాంటి యాక్సెస్ కోసం అక్కడే ఇవ్వాలి. ఆ తర్వాత ENCRYPT బటన్ మీద క్లిక్ చేయండి.

ఈ యాప్ ను ఉపయోగించి.. పీడీఎఫ్ ఫైల్స్ తో పాటు… గూగుల్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్, ప్రసెంటేషన్స్ కు కూడా పాస్ వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అలాగే.. ఇదివరకే పాస్ వర్డ్ సెట్ చేసి ఉన్న పీడీఎఫ్ ఫైల్స్ కు పాస్ వర్డ్ ను తీసేయొచ్చు. పీడీఎఫ్ టూల్ బాక్స్… మరో కొత్త పీడీఎఫ్ ఫైల్ ను క్రియేట్ చేస్తుంది. మీ డ్రైవ్ లోనే పాస్ వర్డ్ అవసరం లేని పీడీఎఫ్ ఫైల్ ను క్రియేట్ చేయడం వల్ల.. ఎటువంటి పాస్ వర్డ్ అవసరం లేకుండా.. ఫైల్ ను ఓపెన్ చేసుకోవచ్చు.

దాని కోసం.. పాస్ వర్డ్ సెట్ చేసి ఉన్న ఫైల్ ను సెలెక్ట్ చేసుకొని.. పీడీఎఫ్ టూల్ బాక్స్ ఓపెన్ చేసి.. Decrypt PDF అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని.. ఇదివరకు సెట్ చేసిన పాస్ వర్డ్ ను అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Decrypt బటన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఒరిజినల్ పాస్ వర్డ్ కు మ్యాచ్ అయితే… పాస్ వర్డ్ ప్రొటెక్షన్ ఉండదు. పాస్ వర్డ్ ను తీసేయడంతో మామూలుగానే ఫైల్ ను ఓపెన్ చేసుకోవచ్చు.