Whatsapp : ఈరోజుల్లో వాట్సప్ ఉపయోగించని వాళ్లు ఎవరూ లేరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సప్ వాడుతున్నారు. ఎవరికైనా ఏదైనా మెసేజ్ పంపించాలన్నా, వీడియో కాల్, వాయిస్ కాల్స్, ఫోటోలు, వీడియోలు ఇలా పలు రకాలుగా వాట్సప్ ను వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాట్సప్ ను వాడుతున్నారు. దీనికి ఉన్న క్రేజే వేరు. పాపులర్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. ఫేస్ బుక్ కంపెనీకి చెందిన ఈ యాప్ కు నెలకు 2 బిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. 2 బిలియన్ అంటే 200 కోట్లు అన్నమాట. అంటే మన భారతదేశ జనాభా కంటే కూడా ఎక్కువ.
అయితే.. వాట్సప్ లో చాలామంది కొన్ని మెసేజ్ లు పంపిస్తుంటారు. తొందరపాటులో ఒకరికి పంపించబోయి మరొకరికి పంపిస్తుంటారు. పొరపాటున ఎవరికైనా పంపించినా.. లేదా ఒక మెసేజ్ పంపించబోయి మరో మెసేజ్ పంపించినా వెంటనే దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ మెసేజ్ పొందిన వాళ్లు దాన్ని చూడకుంటే చదవలేదు. దిస్ మెసేజ్ ఈజ్ డిలీటెడ్ అనే సమాధానం వస్తుంది. మరి.. డిలీట్ అయిన ఆ మెసేజ్ ను చదవాలంటే ఏం చేయాలి? దాని కోసం సెట్టింగ్స్ చేసుకుంటే చాలు. వెంటనే ఆ డిలీట్ చేసిన మెసేజ్ ను చదివేయొచ్చు.
Whatsapp : సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇలా చేయండి చాలు
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వాళ్లు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. నోటిఫికేషన్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ ను టాప్ చేసి ఆన్ చేయాలి. అక్కడ యూజ్ నోటిఫికేషన్ హిస్టరీ బటన్ ను ఆన్ చేయాలి. నోటిఫికేషన్ హిస్టరీని ఆన్ చేసిన తర్వాత వాట్సప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లను చూసుకోవచ్చు. వాటిని డిలీట్ చేసినా ఎప్పుడైనా చూసుకోవచ్చు. మామూలుగా వాట్సప్ లో ఎవరికైనా మెసేజ్ చేస్తే దాన్ని 2 రోజుల 12 గంటల్లోపు డిలీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డిలీట్ చేసినా డిలీట్ కాదు. అందుకే ఎవరికైనా పొరపాటున మెసేజ్ పంపిస్తే దాన్ని ఆ సమయంలోపు డిలీట్ చేసుకోవాలి.