how to register for covid vaccine above 18 years people
how to register for covid vaccine above 18 years people

Covid Vaccine : మీకు 18 ఏళ్లు నిండాయా? అయితే.. ముందు మీరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎందుకంటే.. ఇప్పటికే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. 45 సంవత్సరాలు పైబడిన వాళ్లతో పాటు.. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ థర్డ్ ఫేజ్ లో భాగంగా… కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిని అందరికీ కరోనా వ్యాక్సిన్ ను అందిస్తోంది. మే 1, 2021 నుంచే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం అయింది. అయితే.. మధ్యలో కొన్ని రోజులు వ్యాక్సిన్ షార్టేజ్ వల్ల కొన్ని రోజులు వ్యాక్సినేషన్ నిలిచిపోయినా.. మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.

how to register for covid vaccine above 18 years people

అందుకే.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. www.cowin.gov.in అనే వెబ్ సైట్ లో కానీ.. Aargoya Setu App లో కానీ.. UMANG యాప్ లో కానీ.. కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

Covid Vaccine : రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్లు ముందుగా.. అన్ని డాక్యుమెంట్లను రెడీగా పెట్టుకోవాలి. అంటే.. ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా  ఫోటో ఐడీ, మొబైల్ నెంబర్ ను సిద్ధంగా ఉంచుకోవాలి. కోవిన్ వెబ్ సైట్ ను ఓపెన్ చేశాక.. Register / Sign In yourself అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ ను ఎంటర్ చేసి.. ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు వివరాలు ఇచ్చి.. ఏ సెంటర్ లో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నారో.. ఆ వివరాలు ఇచ్చి అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకోవాలి.

ఒకవేళ ఆరోగ్య సేతు యాప్ ద్వారా కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే.. యాప్ ఓపెన్ చేసి కోవిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి.. vaccination registration అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని వెరిఫై చేసి.. రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

అపాయింట్ మెంట్ బుక్ అయిన తర్వాత.. వ్యాక్సిన్ వేసుకునే రోజున.. అపాయింట్ మెంట్ స్లిప్ తో పాటు.. ఫోటో ఐడీని అంటే ఆధార్ కార్డు కానీ.. మిగితా ఏదైనా ఫోటో ఐడీ కార్డు మీరు రిజిస్టర్ సమయంలో సమర్పించిన దాని ఒరిజినల్ కార్డును తీసుకొని వెళ్లాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 12, 2021 at 8:26 సా.