how to unlock iphone after wearing mask
how to unlock iphone after wearing mask

Unlock iPhone : నేటి జనరేషన్ లో ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ ను ఎంతలా మనం వాడుతున్నామో అందరికీ తెలుసు. ఐఫోన్ అంటేనే ఒక స్టేటస్ కు సింబల్. ఒక్క ఐఫోన్ మాత్రమే కాదు.. యాపిల్ ప్రాడక్ట్స్ అన్నింటికీ ఉన్న డిమాండ్ మామూల్ది కాదు. ముఖ్యంగా యూత్ యాపిల్ ప్రాడక్ట్స్ కు వెంటనే ఆకర్షితులవుతారు. ఏది ఏమైనా ఒక్కసారైనా జీవితంలో ఐఫోన్ కానీ.. ఇతర యాపిల్ ప్రాడక్ట్స్ ను కానీ వాడాలని అనుకోని వారు ఉండరు. అదంతే.. యాపిల్ అంటేనే అంత. దానికున్న రేంజే వేరు.

how to unlock iphone after wearing mask
how to unlock iphone after wearing mask

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మనకు బయటికి వెళ్తే డ్రెస్ ఎంత ముఖ్యమో.. ఫేస్ కు మాస్క్ కూడా అంతే ముఖ్యం. ముఖానికి మాస్క్ లేకుండా ఇప్పుడు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా ఇక బయటికి వెళ్తే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ఉండాల్సిందే అనే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.. బయటికి వెళ్లాక ముఖానికి మాస్క్ ధరించాక.. మళ్లీ దాన్ని ముట్టుకోవడం ఉండదు. మళ్లీ ఇంటికి వచ్చాకనే మాస్క్ ను చాలా వరకు ముట్టుకొని తీసేసి దాన్ని పడేయడమో లేక దాన్ని ఉతకడమో చేస్తుంటారు. ఒకవేళ బయటికి వెళ్లినప్పుడు ఫోన్ ను అన్ లాక్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతోంది. ఎందుకంటే.. చాలామంది తమ ఫోన్లకు ఫేస్ అన్ లాక్ ను పెట్టుకుంటారు. ఐఫోన్స్ కు కూడా అంతే. అటువంటి సమయంలో మాస్క్ ధరించి ఉండటం వల్ల.. బయటికి వెళ్లినప్పుడు తమ ఫోన్ ను అన్ లాక్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లకు తమ ఫోన్ ను మాస్క్ ఉండగా ఎలా అన్ లాక్ చేయాలో తెలియడం లేదు. చాలా ఇతర బ్రాండ్ల ఫోన్లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఐఫోన్ వినియోగదారులు మాత్రం ఫేస్ అన్ లాక్ నే వాడుతుంటారు. మరి.. ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్నా కూడా ఐఫోన్ ను ఎలా అన్ లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Unlock iPhone : ఈ స్టెప్స్ లో ఐఫోన్ ను అన్ లాక్ చేసుకోండి

యాపిల్.. తన ఐఫోన్ ఎక్స్ మోడల్ నుంచి ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఐఫోన్ కు ముఖాన్ని సరిగ్గా చూపిస్తేనే ఫోన్ అన్ లాక్ అవుతుంది. చీకటిగా ఉన్నా.. మసక మసకగా ఉన్నా.. వెలుతురు తక్కువగా ఉన్నా కూడా ఐఫోన్ అన్ లాక్ కాదు. అలాగే.. మాస్క్ వేసుకొని ఉన్నా కూడా అంతే. ప్రస్తుత తరుణంలో ఫేస్ మాస్క్ కంపల్సరీ కాబట్టి.. యాపిల్ కంపెనీ దాని కోసం ఒక పరిష్కారాన్ని ఐఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.

Unlock iPhone : యాపిల్ వాచ్ ఉంటే చాలు.. ఫేస్ మాస్క్ ఉన్నా అన్ లాక్ చేయొచ్చు

దీని కోసం యాపిల్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. ఐఓఎస్ 14.5 అనే కొత్త వర్షన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ వర్షన్ కు అప్ డేట్ చేసుకున్నాక.. యాపిల్ వాచ్ ను ఉపయోగించి.. మీ ఫోన్ ను మాస్క్ ఉన్నా కూడా ఫేస్ అన్ లాక్ చేయొచ్చు. అదే unlock with apple watch అనే ఫీచర్. MacBook Air, MacBook Pro లో ఇదివరకు ఈ ఆప్షన్ ఉండేది. తాజాగా.. iPhone లో కూడా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

how to unlock iphone after wearing mask
how to unlock iphone after wearing mask

దాని కోసం ముందుగా మీ ఐఫోన్ లో FaceID ఫీచర్ ఉండాలి, యాపిల్ వాచ్ సిరీస్ 3 లేదా అంతకంటే ఎక్కువ సిరీస్ ఉన్న వాచ్ ఉండాలి. ఐఫోన్ లో iOS 14.5 వర్షన్ అప్ డేట్ చేసుకోవాలి. Apple watch లో WatchOS 7.4 వర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత iPhone లో FaceID ఆప్షన్ ను ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత Apple Watch ను ఓపెన్ చేసి దానికి Passcode ను సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత Apple Watch లో Wrist Detection అనే ఆప్షన్ ను కూడా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత యాపిల్ వాచ్ ను ధరించి… దాన్ని అన్ లాక్ చేసి ఉంచాలి.

ఆ తర్వాత.. మీ iPhone లో ఉన్న సెట్టింగ్స్ లోకి వెళ్లి.. అక్కడ FaceID, Passcode అనే ఆప్షన్ ను క్లిక్ చేసి.. అక్కడ iPhone Passcode ను ఎంటర్ చేయాలి. పాస్ కోడ్ ఎంటర్ చేయగానే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ కిందికి స్క్రోల్ చేసి.. Unlock with Apple Watch అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని టాప్ చేయాలి. అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత Turn On అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు.. మీ ఫేస్ అన్ లాక్ ఆప్షన్ ఆన్ అవుతుంది.

how to unlock iphone after wearing mask
how to unlock iphone after wearing mask

ఇక.. మీరు ఫేస్ మాస్క్ వేసుకొని బయటికి వెళ్లినప్పుడు.. మీరు ఐఫోన్ ను ఓపెన్ చేయగానే.. అది ఫేస్ మాస్క్ ఉన్నట్టు గమనించి.. వెంటనే మీరు ధరించిన Apple watch కి సిగ్నల్ పంపిస్తుంది. Apple watch అన్ లాక్ కాగానే.. వెంటనే మీ ఐఫోన్ కూడా అన్ లాక్ అవుతుంది. అంతే.. సింపుల్.. ముందే అన్ని సెట్టింగ్స్ చేసేసుకుంటే.. మాస్క్ వేసుకున్నా.. ఐఫోన్ ను అన్ లాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే మీరు ఫేస్ మాస్క్ వేసుకొని బయటికి వెళ్లినప్పుడు ఐఫోన్ తో పాటు యాపిల్ వాచ్ ను కూడా ధరించాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 12, 2021 at 5:13 సా.