how to use whatsapp without phone Number

How To Use WhatsApp Without Phone Number : అసలు ఫోన్ నెంబర్ లేకుండా వాట్సప్ ను ఉపయోగించలేమా? అంటే ఉపయోగించగలం. అవును.. దాని కోసం కొన్ని ట్రిక్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. అప్పుడు మీ పర్సనల్ నెంబర్ లేకుండానే మీరు వాట్సప్ ను ఉపయోగించవచ్చు. దాని కోసం మీరు చేయాల్సింది ఏంటంటే.. మీరు వాట్సప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాక వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. అక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ నెంబర్ దగ్గర మీ పర్సనల్ నెంబర్ కానీ.. మీరు ప్రస్తుతం యూజ్ చేసే నెంబర్ కానీ ఇవ్వకూడదు.

అక్కడ మీరు వేరే నెంబర్ లేదా వర్చువల్ నెంబర్ ఇవ్వొచ్చు. అలా చేసి మీ సొంత నెంబర్ ను ఇవ్వకుండానే వాట్సప్ ను ఉపయోగించవచ్చు. దాని కోసం రెండు విధానాల్లో వాట్సప్ ను ఫోన్ నెంబర్ లేకుండా ఉపయోగించవచ్చు. మొదటిది.. లాండ్ లైన్ నెంబర్ తో వాట్సప్ ను లింక్ చేసుకోవడం. వాట్సప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత సెటప్ చేసే సమయంలో ఫోన్ నెంబర్ ప్లేస్ లో మీ కంట్రీ కోడ్, లాండ్ లైన్ నెంబర్ ఇవ్వండి. దాన్ని వెరిఫై చేసుకునే సమయంలో మీరు ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ కాకుండా.. నెంబర్ కాలింగ్ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లాండ్ లైన్ కు ఫోన్ రాగానే అందులో చెప్పి 6 అంకెల నెంబర్ ను ఎంటర్ చేస్తే చాలు. మీ వాట్సప్ వెరిఫై అయిపోయి.. మీ నెంబర్ ఇవ్వకుండానే వాట్సప్ సెటప్ అయిపోతుంది.

How To Use WhatsApp Without Phone Number : టెంపరరీ వర్చువల్ నెంబర్ తో వాట్సప్ ఎలా ఉపయోగించాలి?

మీకు లాండ్ లైన్ నెంబర్ లేకపోతే.. టెంపరరీ వర్చువల్ నెంబర్ తో కూడా వాట్సప్ ను ఉపయోగించవచ్చు. దాని కోసం మీరు TextNow అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఏ ఓఎస్ అయినా.. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఏరియా కోడ్ ఎంటర్ చేస్తే మీకు 5 రకాల ఆప్షన్లను ఇస్తుంది. అందులో మీకు నచ్చిన వర్చువల్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఆ నెంబర్ ను వాట్సప్ సెటప్ లో ఎంటర్ చేసి.. కాల్ మీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ ను క్యాన్సిల్ చేసి కాల్ నెంబర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. TextNow యాప్ ను యాక్టివ్ లో ఉంచితే కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే.. మీరు ఇచ్చిన TextNow వర్చువల్ నెంబర్ కు కాల్ వస్తుంది. అందులో వాట్సప్ వెరిఫికేషన్ కోడ్ చెప్పగానే.. దాన్ని ఎంటర్ చేస్తే చాలు.. మీ వాట్సప్ సెటప్ వర్చువల్ నెంబర్ తో పూర్తవుతుంది. అంటే.. అదే వర్చువల్ నెంబర్ తో మీరు వాట్సప్ ను వినియోగించవచ్చు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 15, 2023 at 10:16 ఉద.