Google : గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. గూగుల్ ప్రపంచ దేశాలకు ఎన్ని రకాల సేవలు అందిస్తున్నదో అందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి గూగుల్ గురించి తెలుసు. చాలామంది గూగుల్ ప్రాడక్ట్స్ లో వాడేది గూగుల్ సెర్చ్ ఇంజిన్. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తుంటాం. కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటాం. గూగుల్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ టెక్ కంపెనీ. గూగుల్ ను ఢీకొట్టే వాళ్లు లేరు. అలాగే.. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు మించి మరో సెర్చ్ ఇంజిన్ వచ్చే అవకాశం లేదు. వచ్చినా అవి కేవలం చాట్ జీపీటీ లాంటి టెక్స్ట్ బేస్ సెర్చ్ ఇంజిన్స్ మాత్రమే వచ్చాయి.
అయితే.. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే.. ఏదో ఒక దగ్గర చిన్న చిన్న తప్పులు చేస్తుంటుంది. గూగుల్ లోనూ చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు గూగుల్ వాటిని సరిదిద్దుకుంటూ కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చూస్తూ యూజర్లకు అనుగుణంగా తమ ప్రాడక్ట్స్ లో పలు మార్పులు చేస్తూ ఉంటుంది గూగుల్. అయినప్పటికీ ఎక్కడ ఒక చోట చిన్న చిన్న ఎర్రర్స్, బగ్స్ ఉంటూనే ఉంటాయి. అందులో ఉన్న ఆ చిన్న మిస్టేక్ ను కనిపెట్టిన ఇద్దరు భారత్ కు చెందిన హాకర్స్ భారీ పారితోషికం పొందారు.
Google : గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ లో ఉన్న సెక్యూరిటీ మిస్టేక్ ను గుర్తించిన హ్యాకర్స్
భారత్ కు చెందిన ఇద్దరు హ్యాకర్స్ గూగుల్ కు చెందిన క్లౌడ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్స్ లో ఉన్న బగ్ ను గుర్తించారు. అది ఒక సెక్యూరిటీ సమస్య. దాన్ని గుర్తించి గూగుల్ కు హెల్ప్ చేశారు. శ్రీరామ్, శివనేష్ అనే ఇద్దరు గూగుల్ లో ఉన్న బగ్స్ ను కనిపెట్టే పనిలో పడ్డారు. గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ లో ఉన్న బగ్స్ ను గుర్తించే సమయంలోనే అందులో ఉన్న ఒక సెక్యూరిటీ ఫీచర్ ఎస్ఎస్ హెచ్ ఇన్ బ్రౌజర్ అనే ఫీచర్ లో సమస్య ఉన్నట్టు గుర్తించారు. అందులో ఉండే జీసీపీ అనే ఫీచర్ ద్వారా వర్చువల్ గా బ్రౌజర్ ద్వారా కంప్యూటర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. వేరే వాళ్ల కంప్యూటర్ ను మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. అది కేవల ఒక క్లిక్ ద్వారా మాత్రమే. కానీ.. అది చాలా సీరియస్ ఇష్యూ. దీని గురించి గూగుల్ టీమ్ కు ఇద్దరూ వెంటనే సమాచారం ఇవ్వడంతో వెంటనే గూగుల్ టీమ్ ఆ బగ్ ను ఫిక్స్ చేసింది. అయితే.. గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే తెఇయా అనే ఒక బగ్ ను ఇదివరకే వీళ్లు కనిపెట్టారు. తాజాగా అదే గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ లో ఉన్న మరో బగ్ ను కనిపెట్టి రూ.18 లక్షలు గెలుచుకున్నారు.