indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

Vistadome Coach : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కాస్త నెమ్మదించింది. దీంతో అన్ని రంగాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బ అన్ని రంగాలపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. తిరిగి పుంజుకునేందుకు.. అన్ని కంపెనీలు చాలా కష్టపడుతున్నాయి. అయితే.. భారతీయ రైల్వే కూడా కరోనా దెబ్బకు కుదేలయింది. కరోనా వల్ల ప్యాసెంజర్లు లేక.. ట్రెయిన్స్ నడవక.. చాలా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అందుకే.. రైల్వేస్ లో సరికొత్త ఆలోచనలను చేస్తున్నారు అధికారులు.

indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

అందులో భాగంగానే ఇటీవల కొన్ని రైళ్లలో విస్టాడోమ్ కోచ్ లను ప్రవేశపెట్టింది రైల్వేస్. భారత టూరిజాన్ని ఎంకరేజ్ చేయడం కోసం.. జనాలకు సరికొత్త టూరిజం అనుభూతిని అందించడం కోసం ప్రారంభించిన కోచ్ లే విస్టాడోమ్ కోచ్ లు. ఇప్పటికే కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా విస్టాడోమ్ కోచ్ లను ప్రారంభించిన రైల్వే శాఖ.. తాజాగా ముంబై – పూణె రూట్ లో, బెంగళూరు – మంగళూరు రూట్ లో విస్టాడోమ్ కోచ్ లను ప్రారంభించింది.

indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

భవిష్యత్తులోనూ ఇంకా మరిన్ని రూట్లలో విస్టాడోమ్ కోచ్ లను రైల్వే శాఖ ప్రారంభించనున్నట్టు తెలిపింది. పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం.. పర్యాటక ప్రాంతాలు ఉన్న రూట్లలో విస్టాడోమ్ కోచ్ లను భారతీయ రైల్వే ప్రారంభిస్తోంది.

indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

పశ్చిమ కనుమల్లో ప్రయాణం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే.. పశ్చిమ కనుమలను కనెక్ట్ చేసే.. బెంగళూరు – మంగళూరు రూట్ లో విస్టాడోమ్ కోచ్ ను ప్రారంభించారు. పశ్చిమ కనుమల మీదుగా వెళ్లే ఈ రైలు.. బెంగళూరు నుంచి మంగళూరు చేరుకుంటుంది. ఈ రూట్ లో సఖ్లేష్ పూర్, సుబ్రహ్మణ్య ఘాట్ స్టేషన్లు ఉంటాయి.

indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

పశ్చిమ కనుమలు అంటేనే టూరిజానికి పెట్టింది పేరు. కొండలు, లోయలు, చెట్లు.. పచ్చని ప్రకృతి.. ఆ అందాలను చూసి తనివి తీరాల్సిందే. వర్షాకాలంలో  అయితే.. ఆ అందాలను ఖచ్చితంగా చూడాల్సిందే. అందుకే.. ఆ రూట్ లో విస్టాడోమ్ కోచ్ లను ప్రారంభించారు.

indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

అలాగే.. ముంబై – పూణె రూట్ కూడా అద్భుతమైన ప్రకృతికి నెలవు. అది ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే. ఆ రూట్ లో ఖండాలా, లోనావాలా లాంటి అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. కొండలు, గుట్టలు, లోయలు, టనెల్స్ లో నుంచి రైలు వెళ్తుంది. అలాంటి అద్భుతమైన సుందర దృశ్యాలను చూడటం కోసమే రైల్వే శాఖ.. ఆ రూట్ లో విస్టాడోమ్ కోచ్ లను ప్రారంభించింది.

indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

Vistadome Coach : విస్టాడోమ్ కోచ్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఒక విస్టాడోమ్ కోచ్ లో 44 మంది ప్రయాణించే వీలు ఉంటుంది. ఈ కోచ్ లో ఉండే కుర్చీలు.. 180 డిగ్రీలు తిరుగుతాయి. అంటే.. కుర్చీలను చుట్టూ తిప్పుకోవచ్చు. ఎటు వీలైతే అటు తిప్పుకోవచ్చు. ప్రతి సీటులో స్నాక్ టేబుల్స్ కూడా సెట్ చేసి ఉంటాయి. అలాగే.. సీసీ టీవీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఇందులో ఉంటాయి.

indian railways launch vistadome coaches
indian railways launch vistadome coaches

ఎల్ఈడీ డిస్ ప్లే, ప్యాంట్రీ, రిఫ్రిజరేటర్, మొబైల్ చార్జింగ్ పాయింట్స్, ఓవెన్స్ ఇలా.. అన్ని రకాల సదుపాయాలు ఈ కోచ్ లో ఉంటాయి. బయో టాయిలెట్స్, ఆటోమెటిక్ స్లయిడింగ్ డోర్స్ ఉంటాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 19, 2021 at 9:14 ఉద.