iPhone 14 : ఐఫోన్ అంటేనే ఒక బ్రాండ్. ఐఫోన్ చేతుల్లో పట్టుకొని తిరగాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఐఫోన్ క్రేజ్ అటువంటిది. గత సంవత్సరం విడుదలైన ఐఫోన్ 14 ఎంత సక్సెస్ అయిందో తెలుసు కదా. ఆ ఫోన్ కోసం ఇప్పటికీ జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. ఐఫోన్ 14 మీద ఏవైనా ఆఫర్స్ ఉంటే వెంటనే కొనేస్తున్నారు. తాజాగా ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇప్పటి వరకు ఐఫోన్ 14 మీద అంత భారీ తగ్గింపు ఎప్పుడూ ఇవ్వలేదు.
ఐఫోన్ 13 ధరకే ఐఫోన్ 14 దొరికే అవకాశం ఉండటంతో ఐఫోన్ లవర్స్ కూడా ఆ ఫోన్ ను తక్కువ ధరకు దక్కించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐఫోన్ 14 మీద రూ.15 వేల వరకు ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఐఫోన్ 14 అసలు ధర రూ.79,999. కానీ.. ఫ్లిప్ కార్ట్ లో రూ.68,999 కే ఆ ఫోన్ ను దక్కించుకోవచ్చు. ఇది బేసిక్ డిస్కౌంట్. బేసిక్ డిస్కౌంట్ ద్వారా రూ.11 వేల తగ్గింపు లభిస్తుంది.
iPhone 14 : రూ.64,999 కే ఐఫోన్ ను చేజిక్కించుకోండి ఇలా
కానీ.. ఐఫోన్ 14 ను రూ.64,999 కే చేజిక్కించుకోవచ్చు. మీకు హెచ్‌డీఎఫ్ఎసీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. దాని ద్వారా ఐఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.4000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే.. మీకు ఫోన్ రూ.64,999 కే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఇచ్చే రూ.11 వేల డిస్కౌంట్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చే రూ.4 వేల డిస్కౌంట్ అన్నీ కలిపితే రూ.15 వేల డిస్కౌంట్ ఐఫోన్ 14 కు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.
ఒకవేళ ఐఫోన్ 13 కావాలని అనుకునే వారు.. రూ.61,999 కే చేజిక్కించుకోవచ్చు. ఆ ఫోన్ కు కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్ఎసీ క్రెడిట్ కార్డు ఉంటే రూ.3 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఐఫోన్ లవర్స్ వెంటనే ఐఫోన్ ను బుక్ చేసుకోండి.