iPhone 15 : ఐఫోన్ 14 గత సంవత్సరమే లాంచ్ అయింది. ఐఫోన్ 14 కూడా మార్కెట్ లో హిట్ అయింది. అయితే.. ప్రతి సంవత్సరం ఒక మోడల్ ను యాపిల్ లాంచ్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం ఐఫోన్ 15 ను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది యాపిల్ సంస్థ. ఇప్పటికే లాంచ్ చేసిన మోడల్స్ లా కాకుండా.. ఐఫోన్ 15 లో అత్యాధునికమైన ఫీచర్లను యాడ్ చేయడానికి యాపిల్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.
గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లలో పలు మార్పులను మనం గుర్తించిన విషయం తెలిసిందే. ఐఫోన్ 14 ప్రోలోనే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆన్ డిస్ ప్లే, హై రీఫ్రెష్ రేట్, ఫ్యాన్సీ డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. ఇప్పుడు ఐఫోన్ 15లో అంతకుమించిన ఫీచర్లను యాపిల్ తీసుకురానున్నదట.
iPhone 15 : ఐఫోన్ 15 లో తీసుకురాబోయే ఫీచర్లు ఇవే
ఐఫోన్ 15 ఈ సంవత్సరం సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్ ను తీసుకురానుంది యాపిల్. నిజానికి ఐఫోన్ 14 ప్రో మోడల్స్ లోనే ఈ ఫీచర్ ఉన్నప్పటికీ.. ఐఫోన్ 15 అన్ని మోడల్స్ లో ఈ ఫీచర్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. డైనమిక్ ఐలాండ్ అనేది మ్యూజిక్ కంట్రోల్స్, మ్యాప్, నోటిఫికేషన్స్, కాల్స్ లాంటి వాటిని మేనేజ్ చేస్తుంది. ఐఫోన్ 15 లో టైప్ సీ చార్జర్ ను తీసుకురానున్నారు. ఐఫోన్ 12 నుంచి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఐఫోన్ 14 వరకు అన్నీ ఒకే డిజైన్ తో వచ్చాయి. కానీ.. ఐఫోన్ 15 ను సరికొత్త డిజైన్, లుక్ తో తీసుకురావాలని యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కోసం ఎక్కువ వాట్స్ కలిగిన బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లతో ఐఫోన్ 15 లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది.