iPhone 16 Pro : గత సంవత్సరం సెప్టెంబర్ లో యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా. ఐఫోన్ 14 సిరీస్ లో భాగంగా పలు మోడల్స్ ఫోన్లను యాపిల్ సంస్థ లాంచ్ చేసింది. ప్రతి సంవత్సరం ఒక ఐఫోన్ సిరీస్ ను యాపిల్ సంస్థ లాంచ్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేయనుంది. వచ్చే సంవత్సరం అంటే 2024 లో యాపిల్ సంస్థ ఐఫోన్ 16 ను విడుదల చేయనుంది. ఐఫోన్ 16 విడుదలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఐఫోన్ 16 ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే.. ఐఫోన్ 16 సిరీస్ లో ఉండబోయే ఫీచర్లు. అవును.. నిజానికి ప్రస్తుతం ఉన్న ఐఫోన్లలో లేని ఫీచర్లను యాడ్ చేసి కొత్త సిరీస్ ను యాపిల్ సంస్థ ప్రతి సంవత్సరం లాంచ్ చేస్తుంటుంది. ఇక.. ఈ సంవత్సరం రాబోయే ఐఫోన్ 15 లో ఏ ఫీచర్స్ ఉండబోతున్నాయో త్వరలో యాపిల్ సంస్థ కన్ఫమ్ చేయనుంది.
కానీ.. 2024 లో రిలీజ్ కాబోయే ఐఫోన్ 16 సిరీస్ కు సంబంధించిన ఫీచర్ల గురించి సోషల్ మీడియా ఇప్పటి నుంచే కోడై కూస్తోంది. ఐఫోన్ 16 ప్రో మోడల్ ఫోన్లలో అత్యాధునికమైన అండర్ డిస్ ప్లే ఫేస్ ఐడీ ఫీచర్ ఉంటుందట. నిజానికి.. ఇలాంటి ఫీచర్ ఇప్పటి వరకు ఏ ఫోన్ లో లేదు. రాలేదు. ఫేస్ రికగ్నిషన్ కోసం వాడే లెన్స్ కేవలం ఫేస్ ద్వారా లాక్ ఓపెన్ చేసే సమయంలోనే కనిపిస్తాయి. ఆ తర్వాత కనిపించవు అన్నమాట. ఫ్రంట్ కెమెరా లెన్స్ కట్ అవుట్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే.. ఐఫోన్ 15 మోడల్స్ కూడా డైనమిక్ ఐలాండ్ అనే ఫీచర్ తో రానున్నాయట. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో మోడల్స్ లో మాత్రమే ఉంది.
iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రోలో మాత్రమే ఉండనున్న అండర్ డిస్ ప్లే ఫేస్ ఐడీ
అండర్ డిస్ ప్లే ఫేస్ ఐడీ కేవలం యాపిల్ ఐఫోన్ 16 ప్రోలో మాత్రమే ఉండనుందట. అన్ని మోడల్స్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం లేదు అని కొరియాకు చెందిన ఎలెక్ అనే ఓ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. చూడటానికి నార్మల్ డిస్ ప్లే లాగానే ఉంటుంది కానీ… అన్ లాక్ చేసేటప్పుడే ఆ లెన్స్ తెరుచుకొని ఫేస్ ను రికగ్నైజ్ చేస్తాయి. అండర్ డిస్ ప్లే ఫేస్ ఐడీతో పాటు.. అండర్ ప్యానెల్ కెమెరా(యూపీసీ) అనే ఫీచర్ ను కూడా యాపిల్ త్వరలో తీసుకురానుందట. ప్రస్తుతం యాపిల్ ఫోన్స్ లో ఉన్న డిస్ ప్లే కట్ అవుట్స్ ను ఇవి రీప్లేస్ చేయనున్నాయి.