Jio 5G – Airtel 5G : నువ్వా నేనా.. నేను ముందు.. కాదు నేను ముందు అంటూ జియో, ఎయిర్ టెన్ నెట్ వర్క్ సంస్థలు పోటీ పడుతున్నాయి. దేనికోసం అంటారా? 5జీ సేవల కోసం. మేము ముందిస్తాం.. మేము ముందిస్తాం అంటూ 5జీ సేవలు ఇవ్వడానికి జియో, ఎయిర్ టెల్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి భారత్ లో 5జీని ముందు తీసుకొచ్చింది జియో అనే చెప్పుకోవాలి. ముందు కొన్ని మెట్రో నగరాల్లో గత సంవత్సరం ట్రూ 5జీని జియో లాంచ్ చేసింది.
భారత్ లో 5జీ లాంచ్ అయి 6 నెలలు అవుతోంది. 2023 పూర్తయ్యే లోపు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలను విస్తరించేందుకు ప్రైవేట్ నెట్ వర్క్స్ ప్లాన్ చేస్తున్నాయి. గత 6 నెలల్లోనే జియో, ఎయిర్ టెల్ టెలికాం సంస్థలు దేశంలోని 500 పైచిలుకు నగరాల్లో 5జీ సేవలను విస్తరించాయి. ప్రస్తుతానికి జియో 5జీ సేవలను ఉచితంగానే అందిస్తోంది.
Jio 5G – Airtel 5G : 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల లిస్ట్ ఇదే
జియో, ఎయిర్ టెల్ రెండు టెలికాం సంస్థలు.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో 5జీ సేవలను తీసుకొచ్చాయి. మరి.. ఆ నగరాలు ఏవో వాటి లిస్టును ఒకసారి చూద్దాం. అందులో మీ ఊరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నర్సారావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుమల, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, హిందూపూర్, మదనపల్లి, ప్రొద్దుటూరు, అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్, నంద్యాల్, తెనాలి, అనకాపల్లి, మచిలీపట్నం, తాడిపత్రి, అమలాపురం, ధర్మవరం, కావలి, తనుకు, తుని, వినుకొండ, అదోనీ, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాలహస్తి, తాడెపల్లిగూడెంలో జియో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి.
ఇక తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్, సూర్యాపేట పట్టణాల్లో జియో, ఎయిర్ టెల్ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి.