Jio Bharat Phones Launched at Low Price : మామూలుగా ఈరోజుల్లో ఫోన్ కొనాలంటే ఖచ్చతంగా ఫీచర్ ఫోన్ అయినా సరే ఓ రెండు మూడు వేలు పెట్టాలి. అంత డబ్బు పెట్టినా అది సరిగ్గా పని చేస్తుందో లేదో కూడా తెలియదు. కనీసం ఆ ఫోన్ లో ఎలాంటి ఫీచర్స్ కూడా ఉండవు. కానీ.. అత్యంత తక్కువ ధరకే 4జీ ఫోన్ ను, ఇతర ఫీచర్ ఫోన్లను అందిస్తోంది జియో. ఇప్పటికే జియో నుంచి వీ2 సిరీస్, కే1 కార్బన్ ఫోన్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జియో భారత్ పేరుతో బీ1 4జీ ఫోన్ ను తాజాగా జియో లాంచ్ చేసింది.
జియో భారత్ బీ1 ఫోన్ ధర రూ.1299 మాత్రమే. ఇది 4జీ ఫోన్. 2.4 ఇంచ్ బిగ్ స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు మూవీస్, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్, అన్నీ చూసుకునేలా ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. అలాగే.. జియోపే యాప్ కూడా ఇందులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. బ్లాక్ వేరియంట్ లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.2599 అయినా డిస్కౌంట్ లో కేవలం రూ.1299 కే జియో అందిస్తోంది.
Jio Bharat Phones Launched at Low Price : 4జీ ఫీచర్ ఫోన్లలో ఇంత తక్కువ ధరకు మరే ఫోన్ రాదు
4జీ ఫీచర్ ఫోన్లలో ఇంత తక్కువ ధరకు మరే ఫోన్ రాదు. 23 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో జియో సిమ్ మాత్రమే వేసుకోవాలి. 0.5 జీబీ ర్యామ్, మైక్రో ఎస్డీ కార్డు, 128 జీబీ ఎక్స్ టెండెడ్ స్టోరేజ్, బ్లూటూత్, వైఫై, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ, జియోసినిమా, జియోసావన్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
ఇక వీ2 సిరీస్ లో భాగంగా జియో భారత్ ఫోన్ రూ.999 కే అందిస్తున్నారు. ఇది కూడా 4జీ ఫోనే. అలాగే.. కే1 కార్బన్ ఫోన్ ను రూ.999 కే అందిస్తున్నారు. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. సౌండ్, ఫీచర్లలో ఈ ఫోన్ సూపర్బ్ అని చెప్పుకోవచ్చు.
పెద్దవాళ్లకు, ఇంట్లో ఒక ఫోన్ ఉండాలి అని అనుకునే వాళ్లకు.. ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో బెస్ట్ ఫోన్.. పెద్దవాళ్లకు, మన తాతలు, అమ్మమ్మ, నానమ్మలకు ఈ ఫోన్ ను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.