ChatGPT : చాట్‌జీపీటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ ప్రపంచంలో ఏ డౌట్ ఉన్నా.. క్షణాల్లో చాట్ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. అదే దీని ప్రత్యేకత. అయితే.. చాట్ జీపీటీ ద్వారా సమాచారం మాత్రమే తెలుసుకోవడం కాదు.. దాని ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు అని నిరూపించాడు ఈ యువకుడు. చాట్ జీపీటీ ద్వారా మూడు నెలల్లో రూ.28 లక్షలు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
చాట్ జీపీటీ ని ఉపయోగించి దాన్ని కొత్త వాళ్లకు నేర్పించి 23 ఏళ్ల యూఎస్ కు చెందిన ఓ యువకుడు.. 3 నెలల్లో ఏకంగా 35 వేల డాలర్లను సంపాదించాడు. అంటే మన కరెన్సీలో 28 లక్షలు అన్నమాట. చాలామందికి చాట్ జీపీటీ గురించి అవగాహన లేదు. పేరు విన్నారు కానీ.. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. దాన్నే క్యాష్ చేసుకున్నాడు ఆ యువకుడు. చాట్ జీపీటీని కొత్త వారికి నేర్పించి నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు.
ChatGPT : 15 వేల మంది విద్యార్థులకు చాట్ జీపీటీని నేర్పించాడు
చాట్ జీపీటీ గురించి అవగాహన కల్పించేందుకు ఆ యువకుడు 15 వేల మంది విద్యార్థులకు చాట్ జీపీటీ మాస్టర్ క్లాస్ పేరుతో ట్రెయినింగ్ ఇచ్చాడు. గత సంవత్సరం నవంబర్ నుంచే అతడు చాట్ జీపీటీని ఉపయోగించడం నేర్చుకున్నాడు. అప్పటి నుంచి దాని టెక్నిక్స్ అన్నీ నేర్చుకొని దాని మీద విద్యార్థులకు ట్రెయినింగ్ ఇస్తూ లక్షలు సంపాదించాడు.
ఆన్ లైన్ లో విద్యార్థులకు ట్రెయినింగ్ ఇచ్చాడు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఆ యువకుడి దగ్గర చాట్ జీపీటీ ట్రెయినింగ్ తీసుకున్నారు. యూఎస్, భారత్, జపాన్, కెనడా నుంచి కూడా అతడి క్లాస్ ను ఆన్ లైన్ లో జాయిన్ అయిన వాళ్లు ఉన్నారు.