mark zuckerberg to fire meta employees again

Meta : ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో ఏం జరుగుతోంది. ఇప్పటికే టాప్ సోషల్ మీడియా కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలల్లో తమ కంపెనీ ఉద్యోగులను తొలగించాయి. ట్విట్టర్ తో మొదలైన లేఆఫ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సరే.. తమ ఉద్యోగం పోకుండా ఉంది అని అనుకున్న ఉద్యోగులు ఇప్పుడు మళ్లీ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే మెటాలో మరోసారి లేఆఫ్స్ జరగనున్నాయి.

మరోసారి కొందరు ఉద్యోగులను తీసేయాల్సి వస్తుంది. దీనికి అందరు ఉద్యోగులు సహకరించాలని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు తెలిపారు. ఈసారి ఏకంగా 11 వేల మంది ఉద్యోగులను తీసేయనున్నారట. లాభాలు తగ్గడం, సేల్స్ లాంటి వాటిపై ప్రభావం పడటంతో లేఆఫ్స్ అనేది తప్పని సరి అయింది అని కంపెనీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లను ఉద్యోగంలో నుంచి తీసేయాల్సిన ఉద్యోగుల లిస్టు తయారు చేయాలని నిర్ధేశించిందట.

Meta : గత ఏడాది నవంబర్ లో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు

గత సంవత్సరం నవంబర్ లో మెటా.. 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అంటే.. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో పని చేసే ఉద్యోగుల్లో 13 శాతం అన్నమాట. అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ 11 వేల మందిని తొలగించింది. ఇప్పుడు మరోసారి 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకబోతోంది. ఇలాంటి నిర్ణయాలకు పూర్తిగా నేనే బాధ్యుడిని. ప్రతి ఒక్కరికి ఇది కష్టసమయం. ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులు నన్ను క్షమించండి.. అంటూ ఉద్యోగులకు మార్క్ జుకర్ బర్గ్ మెయిల్ పెట్టడం విశేషం.