mark zuckerberg warning to managers of meta employees

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుంటోంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కూడా లేఆఫ్ బాట పట్టాయి. ట్విట్టర్‌తో మొదలైన ఈ లేఆఫ్స్ ఇప్పుడే ఆగేలా లేవు. వరుస పెట్టి కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫేస్ బుక్ కంపెనీ మెటా కూడా వేల మందిని తొలగించింది. మరోసారి కూడా లేఆఫ్ ఉంటుందని మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. 2023 సంవత్సరం ఎఫీషియెన్సీకి నిర్వచనం అంటూ మార్క్ చెప్పుకొచ్చారు.

నవంబర్ 2022 లోనే మార్క్ జుకర్‌బర్గ్ 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ లేఆఫ్స్ ప్రకటించిన వెంటనే మెటా కూడా ఉద్యోగులను తొలగించింది. భవిష్యత్తులో మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని హింట్ కూడా ఇచ్చాడు మార్క్. అలాగే.. కంపెనీలో పనిచేసే మేనేజర్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడట మార్క్. ఏదో వర్క్‌ను మేనేజ్ చేస్తూ ఉండటం కాదు. కోడింగ్ రాయాలని, కంట్రిబ్యూట్ చేయాలని లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని డైరెక్ట్‌గానే చెప్పాడట.

Mark Zuckerberg : 13 శాతం మెటా ఉద్యోగులను తొలగించిన మార్క్

ఇప్పటి వరకు 13 శాతం మెటా ఉద్యోగులను మార్క్ తొలగించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను కొందరిని తీసేశారు. అందులో భారత ఉద్యోగులు కూడా ఉన్నారు. కొందరు ఉద్యోగులను డైరెక్ట్ గా తీసేయలేక.. వర్క్ చేస్తేనే జీతం, ఉద్యోగం.. ఏదో వర్క్ ను మేనేజ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తే ఉద్యోగం ఊడుతుంది. చేతకాకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోండి. కానీ.. ఇక్కడ పని చేస్తే మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది అంటూ సీనియల్ లేవల్ మేనేజర్లకు మార్క్ దమ్కీ ఇచ్చాడట. దీంతో ఉద్యోగులంతా బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారట. ఎప్పుడు ఉద్యోగం లోనుంచి తీసేస్తారో అని టెన్షన్ పడుతున్నారట. ఏది ఏమైనా.. ప్రపంచమంతా ప్రస్తుతం చాలా డేంజర్ జోన్ లో ఉంది. ఇలాగే ఇంకో మూడు నాలుగేళ్లు కంటిన్యూ అయితే.. ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలిపోయి పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది.