meta planning to launch twitter competitor

Meta – Twitter : ట్విట్టర్ ఎరా పూర్తయినట్టేనా ఇక. ఎప్పుడైతే ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారో అప్పటి నుంచి ఐటీ రంగం మొత్తం డిస్టర్బ్ అయింది. ట్విట్టర్ నుంచి మెటా.. మెటాను చూసి మైక్రోసాఫ్ట్ ఇలా.. టాప్ ఎంఎన్సీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను పీకి పారేశాయి. ట్విట్టర్ ఉద్యోగులను తొలగించడమే కాదు.. తన యూజర్ బెస్ ను కూడా రోజురోజుకూ కోల్పోతోంది. ట్విట్టర్ ను ప్రజలు కూడా ఎక్కువ ఉపయోగించడం లేదు. వెరిఫైడ్ పేజ్ కోసం ప్రతి నెల డబ్బులు పెట్టాల్సి వస్తుండటంతో యూజర్లు కూడా ట్విట్టర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. వేరే సోషల్ మీడియా నెట్ వర్క్స్ వైపు మళ్లుతున్నారు.

దాన్ని క్యాష్ చేసుకోవాలని ఫేస్ బుక్ సంస్థ మెటా భావిస్తోంది. అందుకే.. ట్విట్టర్ తరహాలో ఒక సోషల్ మీడియా అప్లికేషన్ ను డెవలప్ చేస్తోంది. దానికి ప్రస్తుతం పీ92 అనే పేరు పెట్టారు. ఈ యాప్ త్వరలోనే లాంచ్ కానుంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ అంతా.. ఈ యాప్ కు అవే క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వొచ్చు. అంటే.. ఇన్ స్టాగ్రామ్ కింద ఈ యాప్ పనిచేస్తుందన్నమాట. టిక్ టాక్ బ్యాన్ తర్వాత ఇన్ స్టాగ్రామ్ కు ఎలా పాపులారిటీ వచ్చిందో.. ట్విట్టర్ డౌన్ అయ్యాక.. మెటా కూడా ట్విట్టర్ తరహాలో యాప్ ను డెవలప్ చేస్తోంది.

Meta – Twitter : యాప్ ఎలా ఉండబోతోంది?

బేసిక్ గా ట్విట్టర్ అనేది టెక్స్ట్ పోస్టింగ్ ప్లాట్ ఫామ్. అది కూడా లిమిటెడ్ క్యారెక్టర్స్. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటి సోషల్ మీడియా నెటవర్క్స్ కాన్సెప్ట్ వేరు. అందుకే.. ట్విట్టర్ తరహాలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను మెటా లాంచ్ చేస్తోంది. యూజర్ ప్రొఫైల్స్, ఫోటోలు, వీడియోలు, ఫాలో ఆప్షన్స్, పోస్టింగ్ ఆప్షన్స్ లాంటి వన్నీ ఇందులో ఉంటాయట. చూద్దాం మరి ట్విట్టర్ లా మెటా ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకొస్తుందో?