WHATSAPP: సోషల్ రంగంలో ప్రధానమైన అప్లికేషన్స్ లో “వాట్స్ అప్” ఒకటి. వాట్స్ నిరంతరం వినియోగదారులకు నూతన అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ ఇస్తూ తన వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తూ ఉంది.

అయితే ఇప్పుడు వాట్స్ అప్ సరికొత్త అప్ డేట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ అప్డేట్ తో యూసర్స్ కు నూతన సదుపాయాలను కలిపించడానికి వాట్స్ ఆప్ ప్రయత్నిస్తుంది.
అయితే ప్రస్తుతం వాట్స్ ఆప్ లో ఎక్కువ ఫైల్ ఉన్నవాటిని పంపడానికి వీలు లేదు. ఫైల్ ఎంతసేపటికి అవుతుందో కూడా మనకు తెలియదు. అయితే ఇప్పుడు వాట్స్ ఆప్ తెచ్చే నూతన ఫీచర్ తో ఈ సమస్యలు తీరనున్నాయి. ఇంకా నుండి 2GB సైజు ఉన్న ఫైల్స్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. అలాగే ఆ ఫైల్ ఎంత సమయంలో వెళ్తుందో కూడా అక్కడ టైం చూపిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే టెలిగ్రామ్ లాంటి అప్స్ లో ఉంది. ఇప్పుడు వాట్స్ కూడా ప్రయత్నిస్తుంది.
అలాగే వాట్స్ ఆప్ గ్రూప్స్ కు సంబంధించి కూడా కొత్త ఫీచర్ ను తెస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు గ్రూప్స్ లలో పోల్ ను కూడా చెయ్యవచ్చు. ఈ ఫీచర్ కూడా టెలిగ్రామ్ ఉంది. ఇవన్నీ ప్రస్తుతానికి బీటా వెర్షన్ వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయ్ . అందరికి అందుబాటులోకివస్తాయి .