OnePlus Nord CE 3 Lite 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ నుంచి అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. అది కూడా భారత్ లో. ఏప్రిల్ 3న వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ ను లాంచ్ చేయనుంది. ఆ ఫోన్ తో పాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 ను కూడా విడుదల చేయనుంది. ఈ ఫోన్ లో అత్యాధునికమైన ఫీచర్లు ఉండనున్నాయి. నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ ధర కూడా బడ్జెట్ లోనే ఉండనుంది. బెటర్ ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది.
ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ కెమెరాతో రానుంది. 6.7 ఇంచ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 60 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, లో బ్రైట్ నెస్, అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్, ఎక్స్ ట్రా 5జీ బ్యాండ్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13, డ్యుయల్ సిమ్ కార్డ్, స్నాప్ డ్రాగన్ 695 5జీ, పాస్టెల్ లైమ్, క్రొమాటిక్ గ్రే, ఎల్ఈడీ ఫ్లాష్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
OnePlus Nord CE 3 Lite 5G : ధరెంత?
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ ధర రూ.27,999 గా ఉండనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అది. ప్రస్తుతానికి 8 జీబీ వేరియంట్ మాత్రం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన నార్డ్ సీఈ2 లైట్ ఫీచర్లే ఈ ఫోన్ లోనూ ఉండనున్నా.. చార్జింగ్ స్పీడ్ పెరగడం, కెమెరా మెగా పిక్సెల్ పెరగడం, ఇంకా అదనపు ఫీచర్లను యాడ్ చేసి వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయనుంది.