Pan Card – Aadhaar Linking : ఇది టెక్నాలజీ యుగం. ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. కరోనా వచ్చినప్పటి నుంచి అంతా డిజిటలైజేషన్ అయింది. ఆ డిజిటలైషన్ వల్ల ప్రతి పని ఆన్ లైన్ లోనే జరుగుతోంది. దాని కోసం ప్రత్యేకంగా ఆఫీసుల చుట్టూ తిరగడాలు పోయాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆధార్ ఉంది. పాన్ కార్డు ఉంది. కానీ.. చాలామంది పాన్ కార్డు, ఆధార్ ను నకిలీ చేసి వాటి ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిని ఏరి పారేసేందుకే.. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవాలని కేంద్రం దేశ ప్రజలకు సూచిస్తోంది.
చాలా ఏళ్ల నుంచి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోవాలని చెబుతున్నా.. చాలామంది అవగాహన లేక, కొందరు నిర్లక్ష్యంతో తమ పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేసుకోలేదు. మార్చి 31, 2023 లోపు ఆధార్, పాన్ కార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే పాన్ కార్డు పని చేయదు. ఆ తర్వాత లింక్ చేసుకోవాలంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే.. వెంటనే ఆధార్, పాన్ ను లింక్ చేసుకోమని సీబీడీటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చెబుతోంది.
Pan Card – Aadhaar Linking : పాన్ తో ఆధార్ ను ఎలా లింక్ చేయాలి?
దాని కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఇన్ కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ సెక్షన్ లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేసి వెరిఫై చేస్తే చాలు.. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే చాలు.. పాన్, ఆధార్ వెరిఫై అవుతుంది.
అలా కాకుండా ఎస్ఎంఎస్ పంపి కూడా పాన్, ఆధార్ ను వెరిఫై చేయొచ్చు. దాని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి UID PAN అని టైప్ చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ కార్డును ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్ కు మెసేజ్ చేస్తే చాలు. వెంటనే మీ ఆధార్ నెంబర్ పాన్ కార్డుకు లింక్ అవుతుంది.