pubg renamed as battlegrounds mobile india registrations open
pubg renamed as battlegrounds mobile india registrations open

PUBG : పబ్ జీ యాప్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో.. పబ్ జీ లవర్స్ అందరూ తెగ టెన్షన్ పడిపోయారు. పబ్ జీ చాలామంది అడిక్ట్ అయిపోవడంతో.. పబ్ జీని బ్యాన్ చేయగానే అందరికీ ఏం చేయాలో పాలుపోలేదు. పబ్ జీకి భారత్ లో లభించినంత ఆదరణ మరే దేశంలో లభించలేదు. చైనాకు చెందిన ఈ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందంటే దానికి కారణం భారత్ లో గేమ్ ను ఆడిన వాళ్ల వల్లనే. భారత్ లో పబ్ జీ ఎంట్రీ ఇచ్చిందో లేదో.. కొట్లలో డౌన్ లోడ్స్.. ప్రతి ఒక్కరు పబ్ జీకి అడిక్ట్ అయిపోయారు. దీంతో ఇండియాలో అప్పట్లో ఎక్కడ చూసినా పబ్ జీ గురించే చర్చ. దీంతో పబ్ జీ కంపెనీకి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అయితే.. అది ఎక్కువ రోజులు నిలవలేదు. భారత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆ యాప్ ను బ్యాన్ చేసింది. అయితే.. భారత్ గేమ్ లవర్స్ కోసం.. పబ్ జీ సరికొత్త రూపంలో మన ముందుకు రాబోతోంది.

pubg renamed as battlegrounds mobile india registrations open
pubg renamed as battlegrounds mobile india registrations open

PUBG కాస్త Battlegrounds Mobile India గా పేరు మార్చుకొని.. త్వరలోనే ఇండియాలో లాంచ్ కాబోతోంది. అయితే.. ఈసారి ఈ గేమ్ ను డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసుకునే వీలు లేదు. దాని కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యాప్ కంపెనీ Krafton ప్రారంభించింది. ప్రి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకే బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది క్రాఫ్టన్ కంపెనీ. ఇప్పటికే గేమ్ ప్రి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. మే 18 నుంచే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి.

PUBG : గేమ్ యాప్ డౌన్ లోడ్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

PUBG యాప్ ప్రస్తుతం BGMI గా మారింది అనే విషయం తెలుసు కదా. దాని పేరే Battlegrounds Mobile India. మీరు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లోకి Battlegrounds Mobile India అని టైప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు battlegrounds పేరుతో చాలా గేమ్స్ కనిపిస్తాయి. కానీ.. వాటిలో Krafton కంపెనీ తయారు చేసిన Battlegrounds Mobile India మీద క్లిక్ చేస్తే.. ప్రి రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ప్రీ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే.. ఈ గేమ్ అందుబాటులోకి రాగానే.. మీకు డౌన్ లోడ్ ఆప్షన్ కావాలా? అని అడుగుతుంది. దీంతో మీరు ఓకే మీద క్లిక్ చేయగానే.. మీకు ఆటోమెటిక్ గా బ్యాటిల్ గ్రౌండ్స్ యాప్ భారత్ లో రిలీజ్ కాగానే.. మీ మొబైల్ లో డౌన్ లోడ్ అయిపోతుంది. గేమ్ డౌన్ లోడ్ కాని వాళ్లకు.. సంస్థ నోటిఫికేషన్ పంపిస్తుంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా.. గేమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

PUBG : ప్రి రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు.. రివార్డ్స్ ప్రకటించిన సంస్థ

అయితే.. ప్రి రిజిస్టర్ చేసుకున్న యూజర్లకు బ్యాటిల్ గ్రౌండ్స్ సంస్థ కొన్ని రివార్డ్స్ ను ప్రకటించింది. మొత్తం నాలుగు రకాల రివార్డ్స్ ను ప్రకటించింది. అవి ఏంటంటే.. రెకాన్ మాస్క్, రెకాన్ ఔట్ ఫిట్, సెలబ్రేషన్ ఎక్స్ పర్ట్ టైటిల్, 300 ఏజీ.. ఇవి గేమ్ ప్రారంభం సమయంలో అవతార్ కు సంబంధించినవి. ఈ రివార్డ్స్ లో ఏదైనా ఉపయోగించుకొని గేమ్ స్టార్ట్ చేయొచ్చు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 21, 2021 at 6:00 సా.