Ratan Tata Brother : రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్టు అయినా సరే చాలా సింప్లిసిటీని మెయిన్ టెన్ చేస్తారు. అందుకే ఆయనంటే చాలామందికి గౌరవం. భారతదేశ పారిశ్రామిక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అయితే.. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో రతన్ టాటా తన చిన్నతనానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలలో తన తమ్ముడు జిమ్మీ టాటాను కూడా చూడొచ్చు. 1945 లో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది. అవి చాలా ఆనందకరమైన రోజులు. మా మధ్య అప్పుడు చాలా అనుబంధం ఉండేది, నా తమ్ముడు జిమ్మీతో అంటూ రతన్ టాటా ఆ ఫోటోను షేర్ చేశారు.
నిజానికి రతన్ టాటా ఫ్యామిలీ గురించి అంటే ఆయన అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రతన్ టాటాకు తమ్ముడు ఉన్నారు. ఆయన పేరు జిమ్మీ టాటా. ఆయన లో ప్రొఫైల్ మెయిన్ టెన్ చేస్తుంటారు. ఆయన టాటా సన్స్, ఇతర టాటా గ్రూప్ కంపెనీలకు షేర్ హోల్డర్. అయినా కూడా ముంబైలోని కొలబాలో ఒక చిన్న ఫ్లాట్ లో ఉంటారు. ఆయన కనీసం మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించరు. ఆయన వయసు ప్రస్తుతం 82 ఏళ్లు.

Ratan Tata Brother : జిమ్మీకి బిజినెస్ చేయడం ఇష్టం లేదట
జిమ్మీకి బిజినెస్ అంటే ఇష్టం లేక.. ఆయన టాటా గ్రూప్ సంస్థల్లో ఎక్కడ కూడా కనిపించడానికి ఇష్టపడలేదంటారు. కాకపోతే ఆయన మంచి స్క్వాష్ ప్లేయర్ అని ఆయన నాతో ఆడినప్పుడల్లా ఆయనే గెలుస్తుంటారని ఆర్పీజీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ హర్ష గొయంకా గతంలో ఒకసారి ట్వీట్ చేశారు. అప్పుడే జిమ్మీ గురించి ప్రపంచానికి తెలిసింది. ఆయనకు బిజినెస్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా ఆయన టాటా సన్స్, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా పవర్ లాంటి కంపెనీలలో షేర్ హోల్డర్ గా ఉన్నారు. మిడిల్ క్లాస్ పార్శీ ఫ్యామిలీ ఎలా జీవితం గడుపుతుందో ఆయన కూడా అలాగే గడుపుతుంటారు. జిమ్మీ టాటా ఎక్కువగా తన నానమ్మ దగ్గరే పెరిగారు. రతన్ టాటా నాన్న చనిపోయిన తర్వాత తన నానమ్మ నవాబాయ్ దగ్గర పెరిగారు జిమ్మీ. కాకపోతే జిమ్మీ టాటా టాటా గ్రూప్ లో ఉన్న టెక్స్ టైల్ బిజినెస్ లోనే తన కెరీర్ ను ప్రారంభించినట్టు కొన్ని మీడియా సంస్థలు అప్పట్లో కథనాలు వెలువరించాయి. ఆయన చాలా తక్కువగా తన అపార్ట్ మెంట్ నుంచి బయటికి వస్తారట. ఎక్కువగా ఆయన ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారని చెబుతున్నారు.