RFID card skimming cyber fraud enables easy theft of credit card sensitive data
RFID card skimming cyber fraud enables easy theft of credit card sensitive data

RFID Card Skimming : ఇది టెక్నాలజీ యుగం. రోజురోజుకూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక దశాబ్దం క్రితం వరకు కూడా ఇంటర్నెట్ అంటే చాలామందికి తెలియదు. టెక్నాలజీ అంటే తెలియదు. కానీ… నేడు మాత్రం టెక్నాలజీ గురించి, ఇంటర్నెట్ గురించి, టెక్నాలజీలో వచ్చే కొత్త కొత్త మార్పుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో… అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీని మంచి కోసం వాడితే చాలా ఉపయోగాలు… అదే చెడు కోసం వాడితే… ఎన్నో మోసాలు… ఎన్నో నష్టాలు… అందుకే… టెక్నాలజీతో పాటే సైబర్ క్రైమ్స్, సైబర్ క్రిమినల్స్ కూడా పెరుగుతున్నారు.

RFID card skimming cyber fraud enables easy theft of credit card sensitive data

ఇదివరకు ఏదైనా షాపింగ్ చేయాలంటే.. ఏదైనా కొనుక్కోవాలంటే షాపునకు వెళ్లాల్సిందే. డబ్బులు తీసుకొని వెళ్లాల్సిందే. కానీ నేడు షాపునకు వెళ్లాల్సిన అవసరం లేదు.. డబ్బులు జేబుల్లో పెట్టుకొని పోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంట్లో కూర్చొనే కావాల్సినవన్నీ కొనుక్కునే సదుపాయం ఇప్పుడు ఉంది. అలాగే.. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా… బయటికెళ్లి కావాల్సిన సరుకులు కొనుక్కునే అవకాశం కూడా నేటి జనరేషన్ లో ఉంది.

వినియోగదారులు పెరుగుతున్నా కొద్దీ… బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను అందిస్తున్నాయి. వాటిలో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ.. వినియోగదారులకు ఎంతో సులభమైన లావాదేవీలను అందిస్తున్నాయి. దానిలో భాగంగా వచ్చిన సరికొత్త ఫీచరే… ఈ contactless cards. దాన్నే RFID(Radio Frequency Identification) Enabled Cards అని కూడా అంటారు. RFID Card Skimming అనే టెక్నాలజీతో రూపొందించిన కార్డును ఉపయోగించి Point of sale(బిల్లింగ్ కౌంటర్) వద్ద కార్డును స్వైప్ చేయకుండానే పేమెంట్ చేయొచ్చు. కార్డులో ఉండే చిప్ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ వద్ద ఉండే డిటెక్టర్ డివైజ్ కార్డు డిటెయిల్స్ ను స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేస్తుంది. దీని కోసం పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు… ఫోన్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది వినియోగదారులకు, మాల్స్, షాపులకు ఎంతో సులభమైన పని.

RFID card skimming cyber fraud enables easy theft of credit card sensitive data

RFID Card Skimming : ఇదే సైబర్ నేరగాళ్లకు వరం… కాంటాక్ట్ లెస్ కార్డుల వల్ల పెరుగుతున్న సైబర్ క్రైమ్స్

మీరు కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డు వాడుతున్నారంటే… మీరు కూడా సైబర్ నేరగాళ్ల కంట్లో పడినట్టే. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మీరు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులను వాడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అదమరిచినా.. సైబర్ నేరగాళ్లు మీ కార్డులోని సెన్సిటివ్ డేటాను దొంగలించే ప్రమాదం ఉంది. అది కూడా మీకు తెలియకుండా. అసలు.. కాంటాక్ట్ లెస్ కార్డు ద్వారా సైబర్ దొంగతనం జరిగిందని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ ద్వారా లావాదేవీలను చేసేస్తారు.

దానికోసం… ఆర్ఎఫ్ఐడీ చిప్ ఉన్న కార్డులను రీడ్ చేయడం కోసం సైబర్ నేరగాళ్లు ఎన్ఎఫ్సీ తో అనుసంధానం అయిన మొబైల్ ను వాడుతారు. ఎన్ఎఫ్సీ అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.. ఇది ఆర్ఎఫ్ఐడీ ద్వారా కార్డులో ఉన్న చిప్ ను యాక్సెస్ చేసుకొని కార్డు వివరాలను స్టోర్ చేస్తుంది. లేదా ఆర్ఎఫ్ఐడీని రీడ్ చేసే ఏదైనా డివైజ్ ను వాడి కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. ఇదే పద్ధతిని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. బిజీగా ఉండే ప్రాంతాల్లో, క్యూ లైన్లలో, మాల్స్ లో, పాయింట్ ఆఫ్ సేల్ వద్ద.. సైబర్ నేరగాళ్లు మాటు వేసి… వెనుక జేబులో పెట్టుకున్న వాలెట్ వద్ద తమ డివైజ్ ను పెట్టి వినియోగదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా కార్డు వివరాలను పొందుతారు. కార్డు నెంబర్, కార్డు వినియోగదారుడి పేరు, ఎక్స్ పైరీ డేట్, సీవీవీ నెంబర్… ఇలా కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు దాని ద్వారా తెలుస్తాయి. ఆ వివరాలతో వెంటనే సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటారు.

RFID card skimming cyber fraud enables easy theft of credit card sensitive data

RFID Card Skimming : సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం

కాంటాక్ట్ లెస్ కార్డులను వాడేవాళ్లు సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకోవాలంటే చేయాల్సింది ఒక్కటే.. అదే కార్డులను పెట్టడం కోసం వాడే వాలెట్ ను మార్చడం. ఆర్ఎఫ్ఐడీ బ్లాకింగ్ వాలెట్ ను వాడితే… ఎటువంటి డివైజ్ అయినా సరే… కాంటాక్ట్ లెస్ కార్డుల వివరాలను తస్కరించలేదు. ఇటువంటి క్రెడిట్ కార్డుల కోసం సపరేట్ గా తయారు చేసిన RFID Credit Card Holder Case వాలెట్ ఆన్ లైన్ లో ఈకామర్స్ వెబ్ సైట్లలో దొరుకుతుంది. ధర కూడా వందల్లోనే ఉంటుంది. అదొక్కటి కొనుక్కొని దాంట్లోనే ఈ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులను దాచుకుంటే… ఎక్కడికెళ్లినా… సైబర్ నేరగాళ్లు ఆ కార్డుల వివరాలను తస్కరించలేరు. సైబర్ నేరగాళ్ల నుంచి బయటపడాలంటే… ఈ వాలెట్ ను వాడాల్సిందే.

RFID card skimming cyber fraud enables easy theft of credit card sensitive data

మీరు కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే.. వాటిని దాచుకోవడం కోసం ఆర్ఎఫ్ఐడీ బ్లాకింగ్ వాలెట్ కావాలంటే… అమెజాన్ లో మీరు కొనుక్కోవచ్చు. వెంటనే ఆర్డర్ చేయాలంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి. వెంటనే కొనుక్కొని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా సేఫ్ గా లావాదేవీలు జరుపుకోండి.

Click here to buy RFID Blocking Wallet

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 17, 2021 at 7:25 ఉద.