Samsung Galaxy S23 Ultra : సామ్ సంగ్ నుంచి గెలాక్సీ ఎస్ 23 సిరీస్ త్వరలో లాంచ్ కాబోతోంది. ఇదివరకే ఎస్ 22 సిరీస్ విడుదలైన విషయం తెలసిందే. సామ్ సంగ్ గెలాక్సీ సిరీస్ లో ఎస్ మోడల్ చాలా ఖరీదైన ఫోన్స్. వాటిలో ఉండే ఫీచర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పటికే ఎస్ 22 మోడల్ క్లిక్ అవడంతో ఎస్ 23 మోడల్ ఫోన్లను కూడా త్వరలో మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఫిబ్రవరి 1 న భారత మార్కెట్ లో గెలాక్సీ ఎస్ 23 సిరీస్ లాంచ్ కానుంది. అయితే.. ఇప్పటికే ఈ సిరీస్ ఫోన్ల ధర ఎంతో లీక్ అయిపోయింది. ఫోన్ల ధర, ఫీచర్లు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలాక్సీ ఎస్ 22 సిరీస్ లో భాగంగా ఎస్ 22 , ఎస్ 22 ప్లస్, ఎస్ 22 అల్ట్రా మోడల్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఆ సిరీస్ కు కొనసాగింపుగా ఎస్ 23 మోడల్ ను త్వరలో లాంచ్ చేయనుంది.
Samsung Galaxy S23 Ultra : టెంప్ట్ చేస్తున్న ఎస్ 23 అల్ట్రా మోడల్ ఫీచర్స్
అయితే.. ఎస్ 23 అల్ట్రా అనేది అల్టిమేట్ మోడల్. ఈ మోడల్ ఫోన్ ఫీచర్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎస్ 23 అల్ట్రా ఫీచర్సే కాదు.. దాని ధర కూడా స్మార్ట్ ఫోన్ లవర్స్ ను షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే.. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్ ఫోన్ ధర రూ.1,13,400 గా ఉంది. ఇది వరకు వచ్చిన ఎస్ 22 అల్ట్రా మోడల్ ఫోన్ ధర రూ.1,09,999 గా ఉంది. దానికంటే 3400 రూపాయలు ఎక్కువ ధరతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఎస్ 23 అల్ట్రా ఫోన్ లో 6.8 ఇంచ్ డిస్ ప్లే, 1440 * 3088 పిక్సెల్ రిజల్యూషన్, ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్ సెట్, 12 జీబీ ర్యామ్, ఒక టీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 108 ఎంపీ సెకండరీ కెమెరా, 12 ఎంపీ సెన్సార్స్ రెండు 12 ఎంపీ సెల్ఫీ స్నాపర్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది.