TCS : ఎహె.. ప్రపంచమంతా లేఆఫ్స్ జరిగినా టీసీఎస్ కంపెనీలో జరగదు. చివరకు గూగుల్ కంపెనీలోనూ లేఆఫ్స్ జరిగాయి కానీ.. టీసీఎస్ లో జరగలేదు అని మనం అనుకున్నాం కానీ.. టీసీఎస్ కూడా లేఆఫ్స్ కు అతీతం కాదు అని తాజాగా తేలిపోయింది. అయితే.. కంపెనీలో ఉన్న ఉద్యోగులకు నేరుగా తీసేయకున్నా.. కంపెనీ ఉద్యోగులకు వేరియేబుల్ పే ను కట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే.. కంపెనీలో ఇంక్రిమెంట్స్ లేవన్నమాట.
ఇంక్రిమెంట్స్ ఆపేయడం పక్కన పెడితే.. కంపెనీలో సాధారణంగా ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసుకునే ప్రెషర్స్ అపాయింట్ మెంట్ కూడా లేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ఎంఎన్సీ కంపెనీ.. ఫ్రెషర్స్ కు ఆఫర్ లెటర్ ఇచ్చి ఇప్పటి వరకు ఎప్పుడు జాబ్ అపాయింట్ మెంట్ లెటర్ ఇస్తుందో తెలియడం లేదు. దానికి కారణం.. ప్రస్తుతం కంపెనీలో ఉన్న చాలామంది ఉద్యోగులు బెంచ్ మీద ఉన్నారట. వాళ్లకు ప్రాజెక్టులే లేవట. ఇలాంటి నేపథ్యంలో ఫ్రెషర్స్ కు ఆఫర్ లెటర్స్ ఇచ్చి జాబ్స్ లోకి తీసుకున్నా వాళ్లకు ట్రెయినింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రాజెక్ట్ లోకి తీసుకోవడం కంపెనీకి అదనపు భారం అని భావించి ప్రస్తుతం రిక్రూట్ మెంట్ ను ఆపేసి.. ఫ్రెషర్స్ జాబ్స్ ఆఫర్ ను కొన్నిరోజులు ఆపినట్టు తెలుస్తోంది.
TCS : ఇది టీసీఎస్ కే పరిమితం కాదు
అయితే.. ఇది టీసీఎస్ కే పరిమితం కాలేదు. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి ఇతర కంపెనీలు కూడా ఫ్రెషర్స్ ను క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్లకు ఇంకా అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వలేదు. ఎప్పుడు వాళ్లను ఉద్యోగంలోకి తీసుకుంటారో కూడా సమాచారం లేదు. ఫ్రెషర్స్ మాత్రం తమకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చాయని సంబుర పడుతున్నారు. ఎప్పుడెప్పుడు జాబ్స్ లో చేరాలా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ.. కంపెనీల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రావడం లేదు. చూద్దాం మరి.. ఇంకా భవిష్యత్తులో ఐటీ ఇండస్ట్రీకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో?