Provident Fund Scam : ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. రోజూ సైబర్ నేరాల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. అయినా కూడా మన అజాగ్రత్త వల్ల సైబర్ నేరాల బారిన పడుతున్నాం. చిన్న చిన్న తప్పులే మనకు అకౌంట్లను గుల్ల చేస్తున్నాయి. తాజాగా ఓ లేడీ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో జరిగిన స్కామ్ లో 80 వేల రూపాయలు పోగొట్టుకుంది. ఎలాగో తెలుసుకుందాం రండి.
ముంబైకి చెందిన ప్రైవేట్ స్కూల్ లో పని చేసే 32 ఏళ్ల లేడీ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ కాంటాక్ట్ నెంబర్ కోసం ఆన్ లైన్ లో వెతికింది. అయితే.. గూగుల్ లో సైబర్ క్రిమినల్స్ ఫేక్ పీఎఫ్ నెంబర్ ను పెట్టడంతో దాన్ని చూసి అదే నెంబర్ నిజం అనుకొని ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది. దీంతో అటువైపు సైబర్ క్రిమినల్ ఫోన్ లిఫ్ట్ చేసి పీఎఫ్ ఆఫీసర్ స్టాప్ అన్నట్టుగా ఆ మహిళను నమ్మించాడు.
Provident Fund Scam : ఎయిర్ డ్రాయిడ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకునేలా చేసిన సైబర్ నేరగాళ్లు
ఆ యువతి ఎయిర్ డ్రాయిడ్ అనే యాప్ ను తన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకునేలా చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ తర్వాత తన ఫోన్ ను రిమోట్ యాక్సెస్ చేసుకున్నారు. పీఎఫ్ అకౌంట్ డిటెయిల్స్ కోసం తన బ్యాంక్ డిటెయిల్స్, ఎంపిన్ కూడా చెప్పేలా చేశారు. బ్యాంక్ యాప్ యాక్సెస్ రాగానే.. 16 ట్రాన్జాక్సన్స్ చేసి తన అకౌంట్ లో నుంచి రూ.80 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. వెంటనే తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డానని తెలుసుకున్న ఆ యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అలా..పీఎఫ్ పేరుతో మోసం చేసి సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ లో నుంచి అంత డబ్బును లాగేశారు.