Technology : జియో కంపెనీ నుండి కొత్త లాప్ టాప్ రాబోతుంది, ఎలా ఉంది అంటే. అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఈ ప్రపంచంలో, టెక్నాలజీ రంగం ఒక బంగారు బాట అనే చెప్పుకోవాలి. ప్రపంచంలోని అన్ని దేశాలు మరియు వాటి ముఖ్య కంపెనీలు ప్రస్తుతం టెక్నాలజీ రంగం మీదే దృష్టి పెడుతున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న అతి పెద్ద కంపెనీలు టెక్నాలజీ రంగానికి చెందినవే, దీన్ని బట్టి టెక్నాలజీ రంగం ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా మన భారత దేశంలో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు చెందిన జియో కూడా ఈ రంగంలోకి ప్రవేశించనుంది.
రిలయన్స్ కు చెందిన ఈ జియో కంపెనీ భారత దేశ సెల్యులార్ నెట్‌వర్క్ మరియు సరసమైన సబ్సిడీ పరికరాలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఇటీవలే జియో మరియు గూగుల్ కలసి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ ను లాంచ్ చేయగా, ఇప్పుడు ఇది కొనుగోలుకు మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనితో పాటు ఇంకొక కొత్త స్మార్ట్ ఫోన్ జియోఫోన్ 5Gను త్వరలోనే లాంచ్ చేయనుంది. అయితే ఇప్పుడు తాజాగా, జియో సరికొత్త లాప్టాప్ కూడా మార్కెట్ లోకి తీసుకురానుంది అని రూమర్స్ పాప్ అప్ అవుతున్నాయి. ఈ రూమర్స్ కు తోడుగా ఇటీవలే ఒక హార్డ్‌వేర్ ధృవీకరణ పత్రంలో కూడా ఇది ప్రస్తావించబడింది.
కాకపోతే, ఆ పత్రంలో ఇది దేనికి సంబధించినదో స్పష్టంగా పేర్కొనకపోగ, ఇది ARMకు సంబంధించినదని మరియు Windows 10 యొక్క ARM వెర్షన్‌ను రన్ చేస్తుంది అని మాత్రమే తెలుపబడింది. ఫైలింగ్‌లో “Emdoor Digital Technology Co., Ltd” అని కూడా పేర్కొనబడింది. దీని ఆధారంగా జియో ఒక హార్డ్‌వేర్‌లో ప్రత్యేకత కలిగిన షెన్‌జెన్ ఆధారిత కంపెనీ OEMను సంపదించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డివైజ్ యొక్క “ప్రొడక్ట్ పేరు” “QL218_V2.2_JIO_11.6_20220113_v2” అని తెలిసినందున, విశ్లేషకులు కొంత స్నూపింగ్ చేయగా మరియు Emdoor డిజిటల్ టెక్నాలజీ వెబ్‌సైట్‌లో విస్తారమైన “218-సిరీస్” పరికరాల లైనప్‌ను కనుగొన్నారు. అయితే, ఇవన్నీ Intel లేదా AMD x86 CPUని ఉపయోగిస్తాయి మరియు ARM చిప్ కాదు. వారి డిజైన్‌లు కూడా చాలా భిన్నంగా కనిపిస్తాయి, కాబట్టి జియో ఏ ఛాసిస్‌ని ఉపయోగిస్తుందో మనం చెప్పలేము. కాకపోతే, Emdoor డిజిటల్ టెక్నాలజీ జియో కోసం ప్రత్యేకంగా హార్డ్వేర్ తయారు చేస్తుందని చెప్పవచ్చు.