iPhone 14 : ఐఫోన్ లవర్స్‌కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం ఐఫోన్ లవర్స్ అందరూ ఇష్టపడుతున్న, ఎక్కువ సేల్స్ ఉన్న ఐఫోన్ 14 మోడల్ ను ఆపేయాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది. నిజానికి ప్రతి సంవత్సరం ఒక మోడల్ ను యాపిల్ లాంచ్ చేస్తుంటుంది. గత సంవత్సరం ఐఫోన్ 14ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 15 ను లాంచ్ చేయనుంది. ఈనేపథ్యంలో ఐఫోన్ 14ను ఆపేయాలని భావిస్తోంది.
ఐఫోన్ 15 లాంచ్ లో భాగంగా.. వెనీలా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్(ఆల్ట్రా) ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ మోడల్ ఫోన్స్ రాగానే కొన్ని పాత మోడల్స్ ను ఐఫోన్ ఆపేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ , ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీ ఫోన్ల ప్రొడక్షన్ ను ఆపేస్తోంది.
iPhone 14 : ఐఫోన్ 14 ధర ఎంత ఉంది?
ప్రస్తుతం ఐఫోన్ 14 ధర రూ.79,900 గా ఉంది. ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900 గా ఉంది. ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,900 గా ఉంది. ఐఫోన్ ఎస్ఈ ధర రూ.49,900 గా ఉంది. ఐఫోన్ 13 ధర రూ.69,900 గా ఉంది. ఐఫోన్ 12 ధర రూ.59,900 గా ఉంది. ఐఫోన్ 15 ధర ఎంత ఉంటుందో తెలియదు. ఇంకా కంపెనీ వెల్లడించలేదు.
ఈ సంవత్సరం జూన్ 5న యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో పలు యాపిల్ ప్రొడక్ట్స్ ను లాంచ్ చేయనుంది. మిక్స్ డ్ రియాల్టీ హెడ్ సెట్, మాక్ బుక్ ఎయిర్, ఐవోఎస్ 17, ఐపాడ్ ఓఎస్ 17 లను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.