iPhone Look a like : ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ.. ఐఫోన్ కొనాలంటే పేద, మధ్య తరగతి జనాలకు అందని ద్రాక్షే. అవును.. ఐఫోన్ కొనాలంటే లక్షలకు లక్షలు పోయాలి. అది కొనడమే కాదు.. దాన్ని మెయిన్ టెన్ చేయాలన్నా కష్టమే. యాపిల్ నుంచి వచ్చే ఏ ప్రాడక్ట్స్ అయినా కొనాలంటే వేలకు వేలు వెచ్చించాలి. ఎయిర్ పాడ్స్ కావచ్చు.. మాక్ పీసీలు కావచ్చు.. టాబ్లెట్స్ కావచ్చు.. ఇలా యాపిల్ ప్రాడక్ట్స్ అన్నింటికీ ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక వాల్యూ ఉంటుంది. ఏ ఫోన్ల కంపెనీ అయినా సరే.. యాపిల్ ఫోన్లను ఢీకొట్టాలని చేయని ప్రయత్నాలు లేవు. కానీ.. యాపిల్ ఫోన్ల కిందికి ఇప్పటి వరకు ఏ ఫోన్ రాలేదు.
గత సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 14 సిరీస్ ను యాపిల్ సంస్థ లాంచ్ చేసింది. ఐఫోన్ 14 లో ఉన్న ఫీచర్స్ ఇప్పటి వరకు ఏ ఫోన్లలో లేవు. రాలేదు. త్వరలో రాబోయే ఐఫోన్ 15, 16 సిరీస్ లలో కూడా అద్భుతమైన ఫీచర్లను తీసుకురానుంది. అయితే.. చైనాకు చెందిన ఓ కంపెనీ ఐఫోన్ లాంటి ఫోన్లనే మార్కెట్ లో లాంచ్ చేసింది. ఐఫోన్ లా ఉండే లెఈకో(LeEco) అనే కంపెనీ లెఈకో ఎస్1 ప్రో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. అది చూస్తే అచ్చం ఐఫోన్ 14 ప్రో ఫోన్ లా ఉంటుంది.
iPhone Look a like : లెఈకో ఎస్ 1 ప్రో ఫోన్ ధర కేవలం రూ.10,900
ఈ ఫోన్ ధర కేవలం రూ.10,900. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో బేస్ మోడల్ ధర రూ.1,29,900 కాగా ఈ ఫోన్ కేవలం రూ.10 వేలకే రానుంది. ఈ రెండు ఫోన్ల మధ్య తేడా ఏకంగా రూ.1.19 లక్షలుగా ఉంది. చూడటానికి ఏమాత్రం తేడా లేకుండా అచ్చం ఐఫోన్ లా ఉండేలా ఈ ఫోన్ ను తీర్చిదిద్దారు. అయితే.. హార్డ్ వేర్ లో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ లెఈకో ఎస్ వన్ ప్రోలో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. 6.5 ఇంచ్ ఎల్సీడీ డిస్ ప్లే, హెచ్ డీ ప్లస్ రెజల్యూషన్, 12 ఎన్ఎం జన్ రుయ్ టీ7510 చిప్ సెట్, 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ స్నాపర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. ప్రస్తుతం చైనీస్ మార్కెట్ లో అందుబాటులో ఈ ఫోన్ ను కొనడానికి చైనీయులు ఎగబడుతున్నారు. అయితే.. త్వరలోనే ఈ ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్ లోనూ లాంచ్ చేసేందుకు లెఈకో సంస్థ సన్నాహాలు చేస్తోంది.