tips to write a will
tips to write a will

Will : విల్ అంటే తెలుసా మీకు. ఇంగ్లీష్ లో Will అని రాస్తాం. అంటే వీలునామా. ఫ్యూచర్ టెన్స్ కోసం వాడే will కాదు. విల్ అంటే… వీలునామా రాయడం. వారసత్వపు ఆస్తులకు సంబంధించి.. భవిష్యత్తులో ఎటువంటి గొడవలు రాకుండా ఉండటం కోసం.. ముందే రాసి ఉంచే పత్రాన్నే వీలునామా అంటారు. చాలా కుటుంబాల్లో ఆస్తులకు సంబంధించిన గొడవలు వస్తుంటాయి. ముఖ్యంగా.. తాతలు, ముత్తాల కాలం నాటి ఆస్తుల విషయంలో చాలా గొడవలు జరుగుతుంటాయి… అలాగే వివాదాలు కూడా ఉంటాయి. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసం చట్టపరంగా చెల్లుబాటయ్యేదే వీలునామా. కుటుంబ పెద్ద మరణానంతరం… వారసత్వ ఆస్తిని తమ వారసులు ఎలా పంచుకోవాలి.. ఎవరికి ఆ వారసత్వపు ఆస్తి లభిస్తుంది.. అనే వాటి వివరాలను వీలునామాలో పొందుపరుస్తారు.

tips to write a will
tips to write a will

Will : వీలునామా రాయకపోతే ఏమౌతుంది?

నిజానికి.. చాలామంది వీలునామా రాయరు. కోట్ల ఆస్తులు ఉన్నవాళ్లు కూడా వీలునామాలో జోలికి వెళ్లరు. ఇప్పుడు కాదు కానీ.. కొన్ని దశాబ్దాల కింద కుటుంబ పెద్ద ఖచ్చితంగా వీలునామా రాసేవారు. ఆ వీలునామా ప్రకారం… వారసులు ఆస్తిని పంచుకునే వారు. ఇప్పుడు వీలునామా గురించి పెద్దగా పట్టించుకోకున్నా… ఇప్పటికీ కొందరు వీలునామా పద్ధతిని అవలంభిస్తున్నారు. మనిషితో డబ్బు ఏదైనా చేయిస్తుంది. డబ్బు కోసం మనిషి ఏదైనా చేయడానికి తెగిస్తాడు. కుటుంబ పెద్ద మరణం తర్వాత ఆస్తులు ఉంటే… ఆ ఆస్తులను పంచుకోవడం కోసం వారసులు గొడవ పడుతుంటారు. అందరికీ అలా జరగకపోవచ్చు కానీ.. ఎక్కువ శాతం ఫ్యామిలీల్లో కుటుంబ పెద్ద పోయిన తర్వాత ఆస్తుల కోసం గొడవ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా జరగకుండా ఉండేందుకు… ఫ్యామిలీ పెద్ద మరణానంతరం… ఆయన వీలునామాలో రాసినట్టుగా వారసులు ఆస్తిని పంచుకోవడం కోసం… చనిపోవడానికి ముందే.. వీలునామా రాసి పెడతారు. అందుకే.. వీలునామాను రాసి పెట్టుకుంటే మంచింది.

Will : వీలునామా ఎలా రాయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చాలామందికి వీలునామా ఎలా రాయాలో తెలియదు. దాని మీద అవగాహన లేక.. వీలునామాలో ఏవైనా తప్పులు దొర్లితే అవి తర్వాత చాలా సమస్యలను సృష్టిస్తాయి. ఇంటి యజమాని మరణానంతరం.. వీలునామాలో తప్పులుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే.. వీలునామాను ఎలా రాయాలో తెలుసుకోవడం చాలా అవసరం.

అయితే.. వీలునామాను ఎలా రాయాలో తెలుసుకునే ముందు.. అసలు.. ఒక వ్యక్తి తన ఆస్తిని ఎవరికి రాసి ఇవ్వవొచ్చు.. అనే విషయాలు తెలుసుకుందాం. ఆస్తిపై సర్వహక్కులు ఉన్న వ్యక్తి.. ఆ ఆస్తిని తనకు నచ్చిన వాళ్లకు రాసి ఇచ్చే అధికారం ఉంటుంది. తన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు లేదా.. ఇంకా బయటి వాళ్లకు ఎవ్వరికైనా రాసి ఇవ్వవొచ్చు. తన మరణానంతరం తన ఆస్తి ఎవరికి చెందాలో వీలునామాలో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. తన కొడుకు లేదా కూతురు, భార్య, తల్లిదండ్రులు, లేదా తన సోదరి, సోదరులు… వేరే బంధువులు.. ఇలా ఎవ్వరికైనా ఇచ్చే అధికారం ఆస్తి యజమానికి ఉంటుంది. ఖచ్చితంగా కొడుకుకో… కూతురుకో రాసి ఇవ్వాలని లేదు. లేదా తన ఆస్తిని దానం చేయాలనుకున్నా.. ఏదైనా సంస్థకు రాసివ్వాలనుకున్నా రాసి ఇవ్వవచ్చు. అయితే.. తనకున్న ఆస్తుల్లో ఎవరికి ఎంత నిష్పత్తుల్లో పంచాలి… అనే విషయాన్ని వీలునామాలో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది.

తన ఆస్తిని ఎవరికైనా రాసి ఇచ్చే అధికారం యజమానికి ఉందని తెలుసుకున్నాం కదా.. అయితే.. ఈ వీలునామా అనేది ఏంటి? అసలు.. దాంట్లో ఏముటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. వీలునామాలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రివిలేడ్జ్ వీలునామా.. రెండోడి అన్ ప్రివిలేడ్జ్ వీలునామా.

ప్రివిలేడ్జ్ విల్

ప్రివిలేడ్జ్ వీలునామా అంటే… ఆర్మీలో పనిచేసేవాళ్లు… దేశం కోసం పనిచేసే వాళ్లు… నేవీలో పనిచేసే వాళ్లు.. వీళ్లు రాసే వీలునామాను ప్రివిలేడ్జ్ విల్ అంటారు. వీళ్లంతా దేశం కోసం పనిచేస్తుంటారు కాబట్టి.. వీళ్లకు ఎప్పుడు మరణం సంభవించేది తెలియదు కాబట్టి… వీళ్లు రాసే వీలునామాను ప్రివిలేడ్జ్ విల్ అంటారు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు… వీళ్లు వీలునామా రాయకున్నా.. తమ ఉన్నతాధికారులకో.. తమ సంస్థకో తమ ఆస్తికి ఎవరికి చెందాలో తెలియజేసినా కూడా అది చెల్లుబాటు అవుతుంది.

అన్ ప్రివిలేడ్జ్ విల్

దేశం కోసం పనిచేసేవాళ్లు కాకుండా… మిగితా వాళ్లంతా రాసే విల్ నే అన్ ప్రివిలేడ్జ్ విల్ అంటారు. అంటే.. దేశ పౌరులంతా రాసే విల్ ను అన్ ప్రివిలేడ్జ్ విల్ అంటారు.

Will : వీలునామా రాసే విధానం

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వీలునామా రాసేముందు కొన్ని లీగల్ కు సంబంధించిన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వీలునామా రాసే వ్యక్తిని చట్టప్రకారం… అంటే న్యాయ భాషలో లీగటీ అంటారు. వీలునామా రాయడానికి ఏ భాషను అయినా ఉపయోగించవచ్చు. అయితే… వీలునామా అందరికీ అర్థం అయ్యే విధంగా ఉండాలి. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. చాలా స్పష్టంగా ఉండాలి. అలాగే… తను పోయాక… ఆ వీలునామాను అమలు చేయాల్సిన వ్యక్తి గురించి కూడా వీలునామాలో పేర్కొనాలి. తన వారసులకు ఎంత నిష్పత్తిలో ఆస్తిని పంచాలో కూడా వీలునామాలో స్పష్టం చేయాలి.

వీలునామాను అమలు చేయాల్సిన వ్యక్తి ఆ యజమానికి, ఆయన వారసులకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు.. ఆయన్ను న్యాయ భాషలో ఎగ్జిక్యూటర్ అని అంటారు. ఈ ఎగ్జిక్యూటర్… వీలునామా రాసే వ్యక్తి కంటే వయసులో చిన్నవాడు అయి ఉండాలి. ఎందుకంటే.. వీలునామా రాసే వ్యక్తి కన్నా ముందే ఎగ్జిక్యూటర్ చనిపోకూడదు కాబట్టి… వీలునామా రాసిన వ్యక్తి చనిపోయాక… ఆ వీలునామాను అమలు చేయాల్సిన వ్యక్తి కాబట్టి.

Will : వీలునామా రాశాక ఏం చేయాలి?

చాలామంది వీలునామా రాశాక.. దాన్ని రిజిస్టర్ చేయిస్తారు. అయితే… వీలునామా రిజిస్టర్ చేసినా… రిజిస్టర్ చేయించకున్నా… పర్వాలేదు. దానికి ఖచ్చితంగా రిజిస్టర్ చేయించాలి… అనే నిబంధన అయితే లేదు. కాకపోతే.. ఆస్తుల పంపకాల్లో ఏవైనా తేడాలు వస్తే… భవిష్యత్తులో వస్తాయని గ్రహిస్తే.. దాన్ని రిజిస్టర్ చేయించుకోవడం మంచిది. రిజిస్టర్ చేయిస్తే… దాని చట్టపరంగా చాలా బలంగా ఉంటుంది. వీలునామాలో ఏది ఉంటే అదే చెల్లుబాటు అవుతుంది. రిజిస్టర్ చేయించాలి అని అనుకుంటే… ఇద్దరు సాక్షులతో… సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వీలునామా రాసిన వ్యక్తి దాన్ని రిజిస్టర్ చేయించవచ్చు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 12, 2021 at 8:42 ఉద.