transfer files between android phone and pc without cable
transfer files between android phone and pc without cable

Transfer Files : ప్రస్తుత జనరేషన్ లో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్లే. ఇప్పుడు అవే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. చాలా మంది స్మార్ట్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఏదైనా డేటాను తమ పర్సనల్ కంప్యూటర్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలనుకుంటారు. అదే విధంగా.. తమ పీసీలో ఉన్న డేటాను స్మార్ట్ ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలనుకుంటారు. దాని కోసం ఎక్కువగా USB Cable కానీ Internet Bandwidth ఉపయోగించి డేటాను ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. ఒకవేళ మీ దగ్గర సమయానికి యూఎస్బీ కేబుల్ లేకపోయినా.. ఇంటర్నెట్ డేటా కూడా లేకపోయినా అప్పుడు డేటాను ట్రాన్స్ ఫర్ చేయాలంటే ఎలా? అప్పుడు ఏం చేస్తే డేటా ట్రాన్స్ ఫర్ అవుతుంది. చాలామంది ట్రావెల్ లో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యను ఎదుర్కొంటారు. అటువంటి సమయంలో డేటాను ఎలా ట్రాన్స్ ఫర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

transfer files between android phone and pc without cable
transfer files between android phone and pc without cable

స్మార్ట్ ఫోన్లలో చాలా రకాల బ్రాండ్లు ఉంటాయి. పర్సనల్ కంప్యూటర్ లోనూ చాలా రకలా బ్రాండ్లు ఉంటాయి. అయితే.. ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే.. ట్రాన్స్ ఫర్ చేసుకునే ప్రొసీజర్ మాత్రం సేమ్ ఉంటుంది. మీ దగ్గర డెస్క్ టాప్ కంప్యూటర్ ఉండి, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే.. ఈ రెండింటి మధ్య ఫైల్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకోవాలనుకుంటే.. ఆ సమయంలో మీ దగ్గర యూఎస్బీ కేబుల్ లేకున్నా.. ఇంటర్నెట్ లేకున్నా.. ఈ స్టెప్స్ ఫాలో అయి ఫైల్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకోండి.

Transfer Files : ఒక సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు

దాని కోసం మీరు ముందుగా చేయాల్సింది ఒకటే. ముందు మీ కంప్యూటర్ లో, స్మార్ట్ ఫోన్ లో ఒక అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఒకసారి ఆ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాక.. ఇక మీకు ఇంటర్నెట్ లేకున్నా.. యూఎస్బీ లేకున్నా ఫైల్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

WiFi Pro FTP Server

FileZilla FTP Client

ఈ రెండు అప్లికేషన్లను మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. మొదటిది WiFi Pro FTP Server అనేది FTP Server. దీన్ని స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. రెండోది FileZilla FTP Client అనే అప్లికేషన్ ను డెస్క్ టాప్ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.

transfer files between android phone and pc without cable
transfer files between android phone and pc without cable

వీటిని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత.. మీ మొబైల్ ఫోన్ లో Personal Hotspot ను స్విచ్ ఆన్ చేయండి. హాట్ స్పాట్ ఆన్ చేసినా కూడా WiFi కానీ Mobile Data కానీ అస్సలు ఆన్ చేయకూడదు. ఆ తర్వాత WiFi Pro FTP Server ని ఆన్ చేయాలి.

డెస్క్ టాప్ లో WLAN ను ఆన్ చేసి ఉంచితే.. WiFi Pro FTP Server ని ఎనేబుల్ చేయగానే.. డెస్క్ టాప్ లో ఆన్ చేసి ఉంచిన WLAN తో కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత డెస్క్ టాప్ లోని FileZilla FTP Client ని ఆన్ చేసి స్కాన్ చేయడమే. స్కాన్ చేయగానే.. ఓవైపు మొబైల్ లోని డేటా.. మరోవైపు డెస్క్ టాప్ లోని డేటా.. FileZilla లో కనిపిస్తుంది. అప్పుడు ఫోన్ నుంచి డెస్క్ టాప్ కు, డెస్క్ టాప్ నుంచి ఫోన్ కు డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

transfer files between android phone and pc without cable
transfer files between android phone and pc without cable

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 14, 2021 at 3:13 సా.