twitter search tricks to get better results
twitter search tricks to get better results

Twitter Search Tricks : ట్విట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజుల్లో సెలబ్రిటీల దగ్గర్నుంచి.. సామాన్యుల వరకు ఎక్కువగా ట్విట్టర్ నే వాడుతున్నారు. ఎవరి మీదనైనా కంప్లయింట్ ఇవ్వాలన్నా… ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా.. తమ మనసులో ఉన్నది ఏదైనా చెప్పాలన్నా ఎక్కువగా ట్విట్టర్ నే వాడుతుంటారు. ఎందుకంటే.. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేదేదో.. ముక్కుసూటిగా చెప్పేయడం ట్విట్టర్ లో స్పెషాలిటీ. అయితే ట్విట్టర్ లో ఏదైనా సమాచారం కావలన్నా… ఏదైనా ముఖ్యమైన ట్వీట్ కావాలన్నా.. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలి. అలా అయితేనే కావాల్సిన సమాచారం దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ ట్రిక్స్ ఏదో తెలుసుకుందాం పదండి.

twitter search tricks to get better results
twitter search tricks to get better results

మీరు ఏదైనా ట్వీట్ చేసినా, ట్వీట్ కోసం వెతికినా… Twitter Archiver, Twitter Bots యాప్స్ ఫైర్ అవుతాయి. సింపుల్ సెర్చ్ క్వెరీలు #Oscars అని లేదా ఇంకేదైనా obama min_retweets : 10 filter : news అని ఇలా ట్విట్టర్ అడ్వాన్స్ డ్ సెర్చ్ ఆప్షన్స్ ఉపయోగించి ట్విట్టర్ లో సెర్చ్ చేయొచ్చు.

Twitter Search Tricks : ట్విట్టర్ లో సెర్చ్ ఇలా చేయండి

ట్విట్టర్ లో సెర్చ్ ఆపరేటర్స్ ను ఉపయోగించి ఇలా ట్విట్టర్ లో సెర్చ్ చేయండి. From: BillGates – పర్టిక్యులర్ ట్విట్టర్ యూజర్ కు సంబంధించిన ట్వీట్ల కోసం వాడాల్సి ఉంటుంది.

Filter : verified cool OR amazing – ఈ సెర్చ్ ఆపరేటర్ ఉపయోగించి… వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్స్ కు సంబంధించిన ట్వీట్ల కోసం ఈ సెర్చ్ ఆపరేటర్ ను ఉపయోగించాలి.

iPhone near:NY within : 10mi –  10 మైల్స్ రేడియస్ లో న్యూయార్క్ లో  ఐఫోన్ యూజర్స్ నుంచి ట్వీట్ అయిన ట్వీట్ల కోసం. NY స్థానంలో కావాల్సిన సిటీ పేరు ఇవ్వొచ్చు. iPhone స్థానంలో వేరే ఫోన్ పేరు కూడా ఇవ్వొచ్చు.

iPhone Reviews since : 2020-08-20 until : 2020 -09-20 – పర్టిక్యులర్ టైమ్ రేంజ్ కు సంబంధించిన ట్వీట్ల కోసం.

twitter search tricks to get better results
twitter search tricks to get better results

Gangnam style filter : replies – రిప్లయి ట్వీట్లను మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ exclude:replies అని ఇస్తే రిప్లయి ట్వీట్లు సెర్చ్ రిజల్ట్స్ నుంచి తీసేస్తుంది.

Gangnam style filter : retweets – రీట్వీట్లకు సంబంధించిన ట్వీట్లను మాత్రమే చూపిస్తుంది. Exclude : retweets అని ఇస్తే సెర్చ్ రిజల్ట్స్ నుంచి RT లను తొలగించవచ్చు.

To: BarackObama – filter : links – బరక్ ఒబామాకు పంపించిన ట్వీట్లు, అవి కూడా ఏ లింక్స్ లేని ట్వీట్లు.

Elections list : TIME / time – staff – పర్టిక్యులర్ ట్విట్టర్ లిస్ట్ లో యూజర్స్ కు సంబంధించిన ట్వీట్లు

Youtube.com min_faves : 100 – కనీసం 100 మంది యూజర్లకు ఫేవరేట్ గా ఉన్న యూట్యూబ్ వీడియోల ట్వీట్ల కోసం.

Earthquake min_retweetsw : 10 – కనీసం 10 సార్లు రీట్వీట్ చేసి ట్వీట్ల కోసం

#foodrecipe lang:en – పర్టిక్యులర్ బాషలో చేసిన ట్వీట్లు(en – English)

Youtube good OR amazing OR awesome filter:links – awesome, amazing అని యూట్యూబ్ వీడియోల్లో కామెంట్ చేసిన ట్వీట్లు.

#Emmys filter : images – పర్టిక్యులర్ హ్యాష్ టాగ్ కు సంబంధించిన ట్వీట్లు, వాటిలో ఫోటోలు ఉన్న ట్వీట్లు.

Coronavirus filter:news – కీవర్డ్ కు సంబంధించిన ట్వీట్లు, వాటిలో న్యూస్ వెబ్ సైట్స్ లింక్స్ ఉన్నవాటికి సంబంధించిన ట్వీట్లు.

From: john to : peter – RT – పర్టిక్యులర్ ట్విట్టర్ యూజర్ కు సంబంధించిన ట్వీట్లు, కానీ.. రీట్వీట్లు కాకుండా.

Family games filter : safe – అడల్ట్, సెన్సిటివ్ కంటెంట్ ను ఫిల్టర్ చేయడానికి.

Tornado filter : media – ఫోటోలు, వీడియోలు ఉన్న టొర్నాడో ట్వీట్లు

Music concert filter : native_video – నేటివ్ వీడియో కు సంబంధించిన ట్వీట్లు

Twitter Search Tricks : మోస్ట్ పాపులర్ ట్వీట్ల కోసం ఎలా సెర్చ్ చేయాలి?

ట్వీట్ డెక్ లో ఉండే engagement filter ను ఉపయోగించి.. బెస్ట్ ట్వీట్లను కనుక్కోవచ్చు. అయితే… ట్వీట్ డెక్ లో మాత్రమే ఈ ఆప్షన్ ను ఉపయోగించే వీలు ఉంటుంది. లేదంటే… undocumented search operator ను ఉపయోగించి.. ట్విట్టర్ యాప్ లో మోస్ట్ పాపులర్ ట్వీట్లను కనుక్కోవచ్చు. దాని కోసం twitter search box లోకి వెళ్లి… ఏదైనా సెర్చ్ ను కొట్టి.. దానికి min_retweets: [number] లేదా min_faves:[number] అని సెర్చ్ రిజల్ట్స్ లో ఫిల్టర్ ఇవ్వాలి.

twitter search tricks to get better results
twitter search tricks to get better results

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 11, 2021 at 3:29 సా.